Pawan Kalyan started the Palle Festival programme

‘పల్లె పండుగ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్‌ కల్యాణ్‌

కంకిపాడు: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కృష్ణా జిల్లా కంకిపాడులో ‘పల్లె పండుగ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న అపారమైన అనుభవం ఆంధ్రప్రదేశ్ కు ఎంతో బలమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎంతో అనుభవం ఉన్న నాయకుడు అవసరమని… చంద్రబాబు వంటి నాయకుడి అనుభవాన్ని వాడుకోకపోతే తప్పు చేసినవాళ్లమవుతామని చెప్పారు. అందుకే టీడీపీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని అన్నారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఎన్నో దెబ్బలు తిన్నామని… తట్టుకుని నిలబడ్డామని చెప్పారు. పరిపాలనలో చంద్రబాబు తనకు స్ఫూర్తి అని అన్నారు.

Advertisements

గత వైసీపీ ప్రభుత్వాన్ని పదేపదే విమర్శించడం తనకు ఇష్టం ఉండదని ఈ సందర్భంగా పవన్ అన్నారు. ఎంతో పారదర్శకంగా తమ ప్రభుత్వ పాలన కొనసాగుతోందని చెప్పారు. ప్రభుత్వ అధికారులు కూడా పారదర్శకతతో పని చేయాలని సూచించారు. ఏ అధికారి అయినా తప్పు చేస్తే క్షమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

రాష్ట్ర ప్రజలంతా బాగుండాలనేదే తమ ఆకాంక్ష అని డిప్యూటీ సీఎం చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు రావాలని, పల్లెల్లో వెలుగులు నిండాలని అన్నారు. ఇవన్నీ జరగాలంటే వైసీపీ ప్రభుత్వం పోవాల్సిన అవసరం ఉందని… ఆ పార్టీని ఓడించేందుకు గట్టిగా కృషి చేశామని చెప్పారు. చంద్రబాబు బలమైన నాయకత్వం వల్ల రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని అన్నారు. పరిపాలన వేరు, రాజకీయాలు వేరని చెప్పారు.

3 వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు పవన్ శంకుస్థాపన చేశారు. సంక్రాంతి నాటికి రోడ్ల పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రచించామని ఆయన చెప్పారు. అందుబాటులో ఉన్న ఉపాధి నిధులతో బిల్లులు చెల్లిస్తామని తెలిపారు. పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు కూడా ముందుకొస్తున్నారని చెప్పారు. గ్రామసభల్లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం పంచాయతీ పనులు కొనసాగుతాయని అన్నారు. రూ. 4,500 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల పనులు చేస్తున్నామని చెప్పారు.

Related Posts
నేడు విజయనగరం జిల్లాలో జగన్ పర్యటన
ys Jagan will have an important meeting with YCP leaders today

విజయనగరం జిల్లా గుర్లలో మాజీ సీఎం జగన్ ఇవాళ పర్యటించనున్నారు. ఆయన ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు గుర్లలో చేరుకుంటారు. Read more

Nagarkurnool: నాగర్‌కర్నూలో యువతిపై సామూహిక అత్యాచారం
నాగర్‌కర్నూలో యువతిపై సామూహిక అత్యాచారం

తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూలు జిల్లా ఊర్కొండపేటలో దారుణం చోటుచేసుకుంది. భక్తి నిమిత్తం వచ్చిన యువతిపై సామూహిక లైంగికదాడి జరగడం తీవ్ర ఆగ్రహాన్ని రేపుతోంది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన Read more

గ్రాండ్ లక్కీ డ్రా కార్యక్రమంను నిర్వహించిన కిస్నా డైమండ్ & గోల్డ్ జ్యువెలరీ మరియు అన్సార్ జ్యువెలర్స్
Kisna Diamond Gold Jewelry and Answer Jewelers organized the Grand Lucky Draw programme

నంద్యాల : కిస్నా డైమండ్ & గోల్డ్ జువెలరీ, అన్సార్ జ్యువెలర్స్ భాగస్వామ్యంతో, నంద్యాలలోని సౌజన్య కన్వెన్షన్ హాల్‌లో గ్రాండ్ కిస్నా లక్కీ డ్రా కార్యక్రమంను నిర్వహించింది. Read more

పెరుగుతున్న సైబర్ నేరాలపై డీజీపీ ఆందోళన
DGP Dwaraka Tirumala Rao

దేశంలో పెరుగుతున్న సైబర్‌ నేరాలు దేశవ్యాప్త ట్రెండ్‌కు అద్దం పడుతుండడంపై ఆంధ్రప్రదేశ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ) ద్వారకా తిరుమలరావు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర Read more

×