हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Pawan Kalyan : మధుసూదన్‌ రావుకు నివాళులర్పించిన పవన్‌ కల్యాణ్‌

sumalatha chinthakayala
Pawan Kalyan : మధుసూదన్‌ రావుకు నివాళులర్పించిన పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan : ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కశ్మీర్‌ పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్‌ రావు మృతదేహానికి నివాళులర్పించారు. నెల్లూరు జిల్లా కావలి వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అధైర్య పడొద్దని ప్రభుత్వం తరఫున అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అంతకు ముందు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కావలి చేరుకొని మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు.

మధుసూదన్‌ రావుకు నివాళులర్పించిన పవన్‌

ఉగ్రదాడి ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది

ఇక, ఉగ్రవాద దాడి ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. అమాయకపు ప్రజల పై ఉగ్రదాడి ఘటన నన్ను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఉగ్రదాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, జమ్మూకాశ్మీర్‌ లోని పహల్గామ్‌లో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడిలో అమాయకపు ప్రజలు బలయ్యారు. పహల్గం ఉగ్రదాడిలో ఏపీ వాసి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మధుసూదన్ రావు మృతి చెందాడు.

మృతదేహాన్ని చూసిన బోరున విలపించిన కుటుంబ సభ్యులు

ఈ క్రమంలో ఆయన భౌతికకాయం ఇవాళ(గురువారం) ఉదయం నెల్లూరు జిల్లా కావలికి చేరుకుంది. మధుసూదన్ భౌతికకాయాన్ని నిన్న(బుధవారం) రాత్రి చెన్నై ఎయిర్ పోర్టుకు అక్కడి నుంచి ఈ రోజు ఉదయం కావలికి తీసుకొచ్చారు. ఆయన మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ తరుణంలో మధుసూదన్ అంత్యక్రియలు మధ్యాహ్నం నిర్వహించనున్నారు.

Read Also: ఉగ్ర దాడి.. తిరుమలలో హై అలెర్ట్..!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870