ఐటీ, హెచ్‌ఆర్‌డీ మంత్రి నారా లోకేష్ కుమారుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు నారా దేవాన్ష్ ఇటీవల 175 చెస్ పజిల్స్‌ను కేవలం 11 నిమిషాల 59 సెకన్లలో పూర్తి చేయడం ద్వారా పేరు తెచ్చుకున్నాడు. ఈ ఘనత అతనికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి పెట్టింది. చెస్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పినందుకు గాను నారా దేవాన్ష్‌ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు.

పవన్ కళ్యాణ్ నారా దేవాన్ష్ కు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఇంత చిన్న వయసులోనే చెస్ పజిల్స్‌ను విజయవంతంగా పూర్తి చేయడం అతని మేధస్సుకు అద్దం పడుతుంది అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో దేవాన్ష్ అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలను సాధించి తెలుగు ప్రజల గర్వకారణంగా నిలుస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.