లోక్‌సభ చర్చ (Lok Sabha debate) లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పాకిస్థాన్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ మళ్లీ కుయుక్తులకు పాల్పడితే ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగుతుందని హెచ్చరించారు. దుశ్చర్యలకు తెగబడితే భారత సైన్యం దీటుగా బదులిస్తుందని స్పష్టం చేశారు.పహల్గామ్ ఉగ్రవాదులను మట్టుబెడుతున్నామని మోదీ తెలిపారు. ‘ఆపరేషన్ మహదేవ్’ ద్వారా ఉగ్రవాదులను పూర్తిగా ఏరివేస్తున్నామని పేర్కొన్నారు. ‘ఆపరేషన్ సిందూర్’పై లోక్‌సభలో వచ్చిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.కాల్పుల విరమణలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాత్రను మోదీ తోసిపుచ్చారు. ఉగ్రవాదులను హతమార్చడంలో భారత్ విజయం సాధించిందని తెలిపారు. ప్రపంచంలో ఎవరూ ఆపరేషన్ నిలిపేయమని చెప్పలేదని అన్నారు.

జేడీ వాన్స్‌తో కీలక సంభాషణ
మే 9న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తనతో మాట్లాడారని చెప్పారు. పాక్ భారీ దాడి చేయబోతుందని వాన్స్ హెచ్చరించారని వెల్లడించారు. అలా జరిగితే పాక్ తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశానని మోదీ తెలిపారు.పాకిస్థాన్‌కు ఎవరు సాయం చేసినా చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. బుల్లెట్‌కు బుల్లెట్‌తోనే సమాధానం ఇచ్చామని మోదీ అన్నారు. పాక్ డీజీఎం అర్ధరాత్రి ఫోన్ చేసి ఆపరేషన్ నిలిపివేయమని కోరిన తరువాతే ఆపారని చెప్పారు.మతాల మధ్య చిచ్చు పెట్టేందుకే పహల్గామ్ దాడి జరిగిందని మోదీ మండిపడ్డారు. ఆ తర్వాత సైన్యం పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి ఆపరేషన్ చేపట్టిందని గుర్తు చేశారు. ప్రపంచ దేశాలు ఈ ఆపరేషన్‌ను సమర్థించాయని చెప్పారు.
కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు
‘ఆపరేషన్ సిందూర్’ను కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టడం బాధాకరమని అన్నారు. మీడియా హెడ్‌లైన్‌ల కోసం కొందరు నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల మనసుల్లో స్థానం సంపాదించలేరని వ్యాఖ్యానించారు.పైలట్ అభినందన్ ఘటనను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ వైఖరిపై విమర్శలు గుప్పించారు. ఆయనను సురక్షితంగా తీసుకువచ్చామని గుర్తు చేశారు. భారత సైనిక శక్తిపై పూర్తి నమ్మకం ఉందని మోదీ హైలైట్ చేశారు.
Read Also : Rahul Gandhi : మోదీ, ట్రంప్ ని అబద్ధాల కోరు అని పిలవాలి: రాహుల్ గాంధీ