జూలై 1వ (July 1st) తేదీ నుంచి దేశవ్యాప్తంగా పలు రంగాల్లో కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలులో మార్పుల నుంచి రైల్వే టికెట్ బుకింగ్, క్రెడిట్ కార్డు ఛార్జీల వరకు చాలా విషయాలు మారనున్నాయి. ఇవి బ్యాంక్ కస్టమర్లు, సాధారణ పన్ను చెల్లింపుదారులకు ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి.పాన్ కార్డు దరఖాస్తుకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి అవుతోంది. జూలై 1 నుంచి ఆధార్ గుర్తింపు లేకుండా కొత్త పాన్ కార్డు (PAN Card) అందదు. ఇప్పటికే ఉన్నవారు డిసెంబర్ 31లోగా ఆధార్ లింక్ చేయాలి. లింక్ చేయకపోతే పాన్ కార్డు డీ-యాక్టివ్ అవుతుంది.
తత్కాల్ టికెట్ బుకింగ్‌కు ఆధార్ తప్పనిసరి
ఇకపై రైల్వే తత్కాల్ టికెట్ల కోసం ఆధార్ వేరిఫికేషన్ అవసరం. జూలై 15 నుంచి రైలు టికెట్ బుకింగ్‌కు Two-Factor Authentication విధానం అమల్లోకి వస్తుంది. రిజిస్టర్డ్ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. టికెట్ ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.సీబీడీటీ ఆదాయపు పన్ను రిటర్నుల ఫైలింగ్ గడువును సెప్టెంబర్ 15 వరకు పెంచింది. ముందుగా ఇది జూలై 31గా ఉండేది. ఈ మార్పుతో ఉద్యోగులకు ఊపిరిపీల్చుకునే సమయం లభిస్తోంది.
క్రెడిట్ కార్డుపై కీలక మార్పులు
ఎస్‌బీఐ బ్యాంక్ – ఎలైట్ కార్డులపై విమాన బీమా రద్దు. కనీస బిల్లింగ్ విధానంలో మార్పులు చేస్తోంది.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ – ఇంటి అద్దె, గేమింగ్, డిజిటల్ వాలెట్ లావాదేవీలపై 1% ఫీజు. రూ. 4,999 వరకే గరిష్ఠ రుసుము. ఇన్సూరెన్స్‌కి మినహాయింపు ఉంటుంది.ఐసీఐసీఐ బ్యాంక్ – ATM ఉచిత లావాదేవీలపై పరిమితులు. ఎక్కువ లావాదేవీలపై రూ. 23 ఛార్జ్. ఇతర బ్యాంకుల ATMలకూ ఇదే వర్తిస్తుంది.
అంతర్జాతీయ లావాదేవీలకు అధిక రుసుములు
విదేశీ ATM విత్‌డ్రావల్‌కు రూ. 125 ఫీజు. ఇతర లావాదేవీలకు రూ. 25. కరెన్సీ ఎక్స్చేంజ్‌కి 3.5% ఛార్జ్ ఉంటుంది. IMPS ట్రాన్స్ఫర్‌కి రూ. 2.5–15 వరకూ ఛార్జీలు పెరిగాయి. క్యాష్ డిపాజిట్ పరిమితులు దాటితే అధిక ఛార్జీలకు సిద్ధంగా ఉండాలి.
Read Also : Shafali Jariwala : నటి షఫాలీ మృతిలో కొత్త కోణం