Officer on Duty : ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విలన్ గ్యాంగ్ సినిమాలు చూసినప్పుడు కొన్ని సన్నివేశాలు మన మనసులో నిలిచిపోతాయి. హీరోయిజం మెరిసిన సీన్స్, హీరోయిన్ల గ్లామర్ షాట్స్, లేదా కడుపుబ్బా నవ్వించిన కామెడీ మిగిలిపోతాయి. ఒకప్పుడు తెలుగు సినిమా విలన్లు తమ భయానకమైన మేనరిజంతో ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశేవారు. కానీ ఇటీవల స్టైలిష్ గా భయపెట్టే విలనిజం పెద్దగా కనిపించడంలేదు.అయితే, ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ సినిమా చూసినవాళ్లంతా ఒకటే విషయం చెబుతున్నారు—ఈ సినిమాలోని విలన్ గ్యాంగ్ భయంకరంగా ఉంది! కథలో ఓ యువకుడు పోలీస్ విచారణలో చనిపోతాడు. అతను ఒక డ్రగ్స్ మాఫియా సభ్యుడు. ఆ గ్యాంగ్ దీనికి ప్రతీకారంగా ఆ పోలీస్ ఆఫీసర్‌ను టార్గెట్ చేస్తుంది. పోలీసులు వారిని వేటాడుతుంటే, ఆ గ్యాంగ్ కూడా పోలీసును ఫాలో అవుతూ, కఠినమైన ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది.ఈ నేపథ్యంలో వచ్చే దృశ్యాలు ప్రేక్షకులను కుర్రసించేలా ఉంటాయి.

మాదక ద్రవ్యాలు, విచ్చలవిడితనం, అంతకు మించి అత్యుత్సాహంతో పగ తీర్చుకునే ప్రయత్నాలు—ఇవి ఈ సినిమాలో విలన్ గ్యాంగ్ రచ్చ మామూలుగా లేదనిపిస్తుంది. ముఖ్యంగా ఈ గ్యాంగ్‌ను పోషించిన నటుల పెర్ఫార్మెన్స్ అసాధారణంగా ఉంది. వారు నటిస్తున్నారా, నిజంగానే ఆ పాత్రలుగా మారిపోయారా అన్న అనుమానం కలుగుతుంది.ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు కలిసిన ఈ విలన్ గ్యాంగ్ యాక్టింగ్ హైలైట్‌గా నిలుస్తుంది. ఈ సినిమా చూసినవాళ్లు ఈ గ్యాంగ్ గురించి మాట్లాడుకోకుండా ఉండలేరు. ఒకటికి రెండుసార్లు ఈ సినిమా చూడాలనిపించేంత ఆసక్తిని పుట్టించగలిగారు. ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులను కుదిపేసిన బెస్ట్ విలన్ గ్యాంగ్ ఇదేనని నిశ్చయంగా చెప్పొచ్చు.ప్రస్తుతం ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మిస్సవ్వకండి!