Notices to BRS MLC

బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి నోటీసులు

హైదరాబాద్‌: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌కి బిగ్ షాక్ తగిలింది. ఫామ్‌హౌస్‌లో కోడి పందేల నిర్వహణకు సంబంధించి మొయినాబాద్‌ పోలీసులు ఆయనకు తాజాగా నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్‌ నగర శివారు మొయినాబాద్‌లోని ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు చెందిన ఫామ్‌హౌస్‌లో కోడి పందేల నిర్వహణ తీవ్ర కలకలం రేపింది.

Advertisements
image

క్యాసినో, కోడి పందాలు ఆడుతున్న వారిని రాజేంద్రనగర్ పోలీసులు పట్టుకున్నారు. కోళ్ల పందాలు నిర్వహిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఫామ్‌హౌస్‌పై దాడిలో మొత్తంగా 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఆర్గనైజర్లు భూపతి రాజు, శివకుమార్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు తాజాగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, ఫామ్‌హౌస్‌ను శివ కుమార్‌ వర్మ లీజ్‌కు తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండమొయినాబాద్‌ తోల్కట్టలోని ఫామ్‌హౌస్‌పై దాడిలో 30 లక్షల రూపాయల నగదు, 55 లగ్జరీ కార్లు, 86 పందెం కోళ్లు, బెట్టింగ్ కాయిన్స్, పేకాట కార్డ్స్, పందెం కోళ్ల కోసం వాడే 46 కోడి కత్తులను ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారందరికీ పోలీసులు నోటీసులు ఇచ్చి పంపించేశారు. యూపీఐ ట్రాన్సక్షన్ల కోసం ఆర్గనైజర్లు స్కానర్లు వినియోగించినట్లు పోలీసులు తేల్చారు. యూపీఐ ద్వారా భారీగా లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు.

Related Posts
ట్రంప్ – మస్క్ ఏఐ వీడియో: అమెరికా రాజకీయాల్లో కలకలం
టెస్లాపై దాడి చేస్తే 20ఏళ్లు జైలని ట్రంప్ వార్నింగ్

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమీపిస్తున్న వేళ, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ పై రూపొందించిన ఏఐ-సృష్టించిన వీడియో హల్‌చల్ సృష్టిస్తోంది. అమెరికా Read more

25న ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణ
mahadharna-postponed-in-nallagonda

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ నెల 25న జస్టిస్ బీఆర్ గవాయ్, అగస్టిన్ జార్జ్ మసిహ్ లతో Read more

దూల్‌పేటలో హోలీ వేడుకలో గంజాయి ఐస్‌క్రీం
1500x900 1474862 holi 2023

హైదరాబాద్‌లోని దూల్‌పేటలో హోలీ సంబరాల పేరుతో గంజాయి రహస్యంగా విక్రయిస్తున్న వ్యక్తిని స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఐస్‌క్రీమ్, కుల్ఫీ, బర్ఫీ Read more

Maharastra: మైనర్ బాలిక అత్యాచార కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
13 ఏళ్ల బాలికపై అత్యాచారం – నిందితుడికి 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష

మహారాష్ట్రలోని థానే జిల్లా ప్రత్యేక కోర్టు దారుణమైన లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ప్రకటించింది. అత్యాచార నేరానికి Read more

Advertisements
×