nirmala

తక్కువ టైమ్ లో బడ్జెట్ ప్రసంగాన్ని ముగించిన నిర్మలమ్మ

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిర్మలమ్మ ఇప్పటివరకు 8 సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఎనిమిదో సారి ఆమె బడ్జెట్ ప్రసంగం ఒక గంటా 14 నిమిషాల పాటు జరిగింది. అయితే ఈ సారి మాత్రమే ఆమె తక్కువ సమయంలో బడ్జెట్ ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఫిబ్రవరి 1 న ఆమె ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ కేవలం 56 నిమిషాలు మాత్రమే సాగింది. 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ.. 2020లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం మాత్రం 2 గంటల 40 నిమిషాల పాటు జరిగింది. సమయం మరీ ఎక్కువ అవుతుండటంతో మరో రెండు పేజీలు మిగిలి ఉండగానే ఆమె తన బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాల్లో ఇదే అత్యధిక సమయం కావడం గమనార్హం.

Advertisements

వేతన జీవులకు వరాలు.. వేతన జీవులకోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యక్తిగత ఆదాయపన్నుపై కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను నుంచి మినహాయింపు నిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయిల్ ధరలపై ఫోకస్.. వంటనూనెలపై దేశవ్యాప్తంగా ఫుల్ డిమాండ్ కొనసాగుతోంది.నూనెల ధరలు పేదవాడికి భారంగా మారిన నేపథ్యంలో వంటనూనెల ధరల తగ్గింపునకు ఆరు సంవత్సరాల మిషన్ ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. అంతేకాక ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ. 2కోట్ల వరకు రుణాలు అందించనున్నట్లు పేర్కొన్నారు.

Related Posts
gautam adani :హైకోర్టు లో అదానీకి భారీ ఊరట
హైకోర్టు లో అదానీకి భారీ ఊరట

ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ అదానీలకు బొంబాయి హైకోర్టు సోమవారం భారీ ఊరటనిచ్చింది. దాదాపు ₹388 కోట్ల మార్కెట్ Read more

Central Cabinet: తిరుపతి – కాట్పాడి లైన్ డబ్లింగ్ కు కేంద్రం ఆమోదం
తిరుపతి - కాట్పాడి లైన్ డబ్లింగ్ కు కేంద్రం ఆమోదం

కేంద్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మూడో సారి అధికారం లోకి వచ్చిన తరువాత మోదీ ప్రభుత్వం ఏపీకి సంబంధించి పలు ప్రాజెక్టులకు Read more

కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు
కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు

కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొన్నటివరకు నివురుగప్పిన నిప్పులా వర్గ రాజకీయాలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా సీనియర్ నాయకులు తమ గళాన్ని Read more

మణిపూర్ సీఎంని తొలగించండి : ప్రధానికి బీజేపీ ఎమ్మెల్యేలు లేఖ
Remove Manipur CM. BJP MLAs letter to Prime Minister

ఇంఫాల్ : మణిపూర్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా.. ఈ నేపథ్యంలో అధికార బీజేపీలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. 19 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి బీరెన్ Read more

×