త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన ప్రధాని

Read Time:  1 min
Prime Minister who took holy bath at Triveni Sangam
Prime Minister who took holy bath at Triveni Sangam
FONT SIZE
GET APP

ప్రయాగ్‌రాజ్ : దేశంలో జరుగుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగ్​రాజ్​లో ప్రధాని మోడీ పుణ్యస్నానం ఆచరించారు. ప్రయాగ్ రాజ్‌లోని త్రివేణి సంగమంలో ప్రధాని మోడీ బుధవారం ఉదయం 11:15 గంటలకు పుణ్యస్నానం చేశారు. అంతకుముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి మోడీ యమునా నదిలో బోటు షికారు చేశారు. అరైల్‌ ఘాట్‌ నుంచి సంగం ఘాట్‌ వారకూ బోటులో ప్రయాణించారు.

అనంతరం సంగంఘాట్‌ వద్ద నదీ స్నానాలు ఆచరించి గంగమ్మకు ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా త్రివేణీ సంగమం వద్ద మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చన చేయనున్నారు. అనంతరం సాధు సంతువులతో సమావేశం కానున్నారు. మహా కుంభ్‌ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

కాగా, మహా కుంభమేళా 24వ రోజు కొనసాగుతోంది. ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. గంగ, యమున, సరస్వతి సదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమం లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 39 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుంచి ప్రముఖులు, విదేశీయులు సైతం ఆధ్యాత్మిక వేడుక మహాకుంభ మేళాలో పాల్గొన్నారు. కుంభమేళాకు హాజరై పుణ్యస్నానాలు ఆచరిస్తే దోషాలు తొలగిపోయి, అంతా మంచే జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.