AP Voter List Revision: ఓటర్ల జాబితా సవరణ ఒక నిరంతర ప్రక్రియ: పి.వి.ఎన్. మాధవ్

Read Time:  1 min
AP Voter List Revision: Voter List Revision is a Continuous Process
AP Voter List Revision: Voter List Revision is a Continuous Process
FONT SIZE
GET APP

విజయవాడ : ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఐఆర్) అనేది ప్రతి ఏటా జరిగే నిరంతర ప్రక్రియ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ స్పష్టం చేశారు. కొత్త ఓటర్ల నమోదు, అభ్యంతరాల తొలగింపు ప్రక్రియ జరుగుతూ ఉంటుందన్నారు. ఆదివారం విజయవాడలో ఎస్విఆర్పై ఎపి బిజెపి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ జరిగింది. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ అనేది బిజెపి లేదా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన పథకం కాదని తెలిపారు. ఇది 2002 నుండి అమల్లో ఉందని గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఇది జరిగిందని వివరించారు. ఈసారి ఆధునిక టెక్నాలజీ వినియోగించడం వల్ల ఓటర్ల జాబితాలో అనర్హుల తొలగింపు ప్రక్రియ పారదర్శకతతో జరుగుతోందని చెప్పారు.

Read also: AP Job Calendar 2026: ఏపీ జాబ్ క్యాలెండర్ వచ్చేస్తోంది.. ఏ శాఖలో ఎన్ని ఖాళీలు అంటే?

AP Voter List Revision: Voter List Revision is a Continuous Process

AP Voter List Revision: Voter List Revision is a Continuous Process

బీహార్ ఎన్నికల సమయంలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగిందని గుర్తు చేశారు. ప్రతిపక్షాలు దీనిపై అనవసర రాద్ధాంతం చేశాయని చెప్పుకొచ్చారు. పార్లమెంటులో ఈ అంశంపై స్పష్టతనిస్తూ ప్రతిపక్షాల విమర్శలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిప్పికొట్టారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఎస్ఐఆర్ పై చర్చించామన్నారు. న్యూఢిల్లీలోని ఎలక్షన్ కమిషనర్ కార్యాలయం ముందు గత మూడు రోజులుగా ధర్నా జరుగుతోందని తెలిపారు. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ పూర్తయిందని, మరో 22 రాష్ట్రాల్లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ మహత్తర కార్యక్రమం ప్రారంభం కాబోతుందని చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.