📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Uttar Pradesh: మదర్సాలపై యోగి సర్కార్ సంచలన నిర్ణయం..

Author Icon By Rajitha
Updated: December 23, 2025 • 3:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తర్ ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో మదర్సా ఉపాధ్యాయులు, సిబ్బందికి పోలీసు చర్యల నుంచి రక్షణ కల్పించిన చట్టాన్ని రద్దు చేసింది. 2016లో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన ఈ చట్టం వల్ల అక్రమాలు వెలుగులోకి వచ్చినా పోలీసులు నేరుగా దర్యాప్తు చేయలేని పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ నిబంధనలను తొలగించడంతో మదర్సా సిబ్బందిపై ఫిర్యాదులు లేదా ఆధారాలు లభిస్తే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కలిగింది.

Read also: AP Government: క్రైస్తవుల భద్రతకు భంగం రానివ్వం: సిఎం చంద్రబాబు

Uttar Pradesh

పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతుందని

ఈ నిర్ణయం మదర్సా విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతుందని యోగి ప్రభుత్వం పేర్కొంది. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్న విధానంతోనే ఈ మార్పు తీసుకొచ్చినట్లు స్పష్టం చేసింది. అయితే ఈ అంశంపై రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా, ప్రతిపక్షాలు మాత్రం మైనారిటీలను లక్ష్యంగా చేసుకున్న చర్యగా విమర్శిస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం తన నిర్ణయంపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news Madrasa Law Telugu News UP Politics Yogi Adityanath

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.