हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Jubilee Hills by-election – జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరంటే?

Anusha
Latest News: Jubilee Hills by-election – జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరంటే?

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ (Jubilee Hills) బైపాస్ ప్రాంతం తెలంగాణ రాజకీయాల్లో తాజా హాట్‌ స్పాట్‌గా మారింది.దివంగత, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకస్మాత్తుగా మరణించడంతో, ఉప ఎన్నిక తప్పనిసరి అయింది. అందుకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో వెలువడనుందని అధికార వర్గాలు ప్రకటించాయి.ల సోమవారం మధ్యలోనే అధికారిక నోటిఫికేషన్ బయటకు రావచ్చని అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే స్థానిక రాజకీయ వర్గాలు గట్టిగా చర్చల్లో ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలు తమ అభ్యర్థులను ముందే సిద్ధం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ తరఫున, మాగంటి గోపినాథ్ భార్య సునీత, ప్రచారంతో గట్టి హవా సృష్టించారు. ఆమె స్థానిక సమస్యలపై సజీవ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. సునీత సోషల్ మీడియాలో కూడా చురకనైన పద్ధతిలో ప్రచారం చేస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

సీనియర్ నాయకులకు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం

తాజాగా.. కాంగ్రెస్ అభ్యర్థి పేరు దాదాపు ఫిక్స్ అయినట్లు తెలిసింది. నవీన్ కుమార్ యాదవ్‌ను బరిలోకి దించాలని హస్తం పార్టీ దాదాపుగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) పార్టీలోని సీనియర్ నాయకులకు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ నిర్ణయం వెనుక కొన్ని వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓటర్ల తర్వాత యాదవ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండటమే దీనికి ప్రధాన కారణం.

బీసీ నినాదం కూడా కలిసివస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది.2014 అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ తరపున జూబ్లీహిల్స్ (Jubilee Hills) నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్.. ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్‌లో చేరినప్పటికీ.. 2023 ఎన్నికల్లో టికెట్ పొందలేకపోయారు. కానీ, ఇప్పుడు ఉప ఎన్నికలో ఆయనకు టికెట్ ఇచ్చేందుకు మార్గం సుగమమైందని ప్రచారం జరుగుతోంది.

Jubilee Hills by-election
Jubilee Hills by-election

తమ పార్టీ తరపున అభ్యర్థిని బరిలోకి దించబోమని

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మజ్లిస్ పార్టీ బీఆర్ఎస్‌తో ఉన్న స్నేహ సంబంధాలను తెంచుకుని కాంగ్రెస్‌కు దగ్గరైంది. ఈ విషయాన్ని అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) పలుమార్లు ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 70 వేల మంది మైనార్టీ ఓటర్లు ఉన్నారు. వీరంతా ఏ పార్టీకి ఓటు వేస్తే ఆ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ సహకారాన్ని కోరుతోంది.

ఇటీవల హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌తో సీఎం రేవంత్ రెడ్డి జరిపిన చర్చల్లో ఉప ఎన్నిక ప్రస్తావన వచ్చినట్లు తెలిసింది. ఆ చర్చల్లోనే నవీన్ యాదవ్ (Naveen Yadav) పేరు ఎంపిక గురించి కూడా మాట్లాడినట్లు సమాచారం. మైనార్టీ నాయకుడికి కాకుండా ఇతరులకు టికెట్ ఇస్తే తమకు అభ్యంతరం లేదని, తమ పార్టీ తరపున అభ్యర్థిని బరిలోకి దించబోమని అసదుద్దీన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ప్రజలు సానుకూలంగా స్పందించినట్లు తేలింది

అందుకే అక్కడ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన అజారుద్దీన్‌ (Azharuddin) కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేల్లో నవీన్ పట్ల ఎక్కువ మంది ప్రజలు సానుకూలంగా స్పందించినట్లు తేలింది. అందుకే ఆయనకు టికెట్ ఇచ్చేందుకు సీఎం సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. నవీన్ యాదవ్ అభ్యర్థిత్వంపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/revanth-can-there-be-more-incompetence-than-this-ktr/telangana/548282/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870