📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

News Telugu: Karnataka: సీఎం కుర్చీ కోసం ఢిల్లీ కి చేరిన పంచాయతీ

Author Icon By Rajitha
Updated: November 21, 2025 • 3:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్ణాటకలో సీఎం పదవి మార్పుపై రాజకీయ చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. రెండున్నరేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న సిద్ధరామయ్య (siddaramaiah) స్థానంలో డీకే శివకుమార్‌ను తీసుకురావాలన్న వాదన బలపడుతోంది. దీనికోసం డీకే వర్గం ఎమ్మెల్యేల బృందం ఢిల్లీకి వెళ్లి అధిష్ఠానంతో సమావేశమై, ఆయనకు సీఎం బాధ్యతలు అప్పగించాలని కోరింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డీకేకు భరోసా ఇచ్చినట్లు ఆ వర్గం చెబుతోంది. వారం రోజుల్లో హైకమాండ్ నిర్ణయం వెలువడవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు సిద్ధరామయ్య కూడా హైకమాండ్‌ను కలిసి కేబినెట్ విస్తరణ కోరడం, తన పదవిని కొనసాగించాలనే ప్రయత్నంగా విశ్లేషకులు చూస్తున్నారు.

Read also: Nishanth kumar: తండ్రి గెలుపుపై తొలిసారి స్పందించిన కుమారుడు నిశాంత్

Karnataka: Intense debate over CM change once again in Karnataka

సిద్ధరామయ్యపై నమ్మకం ఉన్నప్పటికీ

ఇదే సమయంలో డీకే శివకుమార్‌కు మద్దతు ఇచ్చే నేతలు ఆయనకే సీఎం వైపు అర్హత ఉందని, కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తేవడంలో ఆయన పాత్ర కీలకమని వాదిస్తున్నారు. రామనగర ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సైన్ సహా పలువురు ఎమ్మెల్యేలు ఢిల్లీలో అగ్రనేతలతో భేటీ అయి తమ అభిప్రాయాలు వెల్లడించారు. సిద్ధరామయ్యపై నమ్మకం ఉన్నప్పటికీ, పార్టీ ఇచ్చిన హామీకి నిలబడుతారని కూడా వారు అంటున్నారు. దీంతో కర్ణాటకలో సీఎం పదవి మార్పు అంశం రాజకీయ వర్గాల్లో రసకందాయంగా మారింది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

CM race Karnataka politics latest news Siddaramaiah Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.