📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

News Telugu: Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక : గెలుపు పై రామచంద్రరావు ధీమా

Author Icon By Rajitha
Updated: October 10, 2025 • 4:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జూబ్లీహిల్స్ Jubilee Hills ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ వేడి చెలరేగింది. ఈ బైపోల్‌ పై మూడు ప్రధాన పార్టీల దృష్టి నిలిచింది. ఇప్పటికే బీఆర్ఎస్‌ (BRS) పార్టీ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ సతీమణి మాగంటి సునీతను తమ అభ్యర్థిగా ప్రకటించగా, అధికార కాంగ్రెస్‌ పార్టీ నవీన్ యాదవ్ను రంగంలోకి దించింది. కాంగ్రెస్‌ మొదటినుంచీ బీసీ వర్గానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పిన హామీ ప్రకారం ఈ ఎంపిక చేసింది. ఇదిలా ఉండగా, బీజేపీ కూడా ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేసుకునే ప్రయత్నంలో ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ (Hyderabad) లో జరిగిన ముఖ్యమైన సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, నాయకులు అభయ్ పాటిల్, చంద్రశేఖర్ తివారీ తదితరులు పాల్గొన్నారు.

Ayyannapatrudu: స్పీకర్ అయ్యన్నకు అరుదైన గౌరవం

Jubilee Hills

జూబ్లీహిల్స్

సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
“జూబ్లీహిల్స్ (jubilee Hills) సీటు గెలిచి ప్రధాని మోదీ గారికి గిఫ్ట్‌గా ఇవ్వాలి, అని పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. జూబ్లీహిల్స్ ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంచారని, ఈ సారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన అన్నారు.

అతను ఇంకా మాట్లాడుతూ,

“బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు హైదరాబాద్‌ నగరాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యాయి. భాగ్యనగరాన్ని విశ్వనగరంగా మార్చుతామని చెప్పి, విషాద నగరంగా మలిచారు,”
అని తీవ్రంగా విమర్శించారు.

వానలు పడితే నగరంలో రహదారులు దెబ్బతింటాయని, ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ అలవాటు అని ఆరోపిస్తూ, ప్రధాని మోదీ తీసుకొస్తున్న కుల గణన (Caste Census) ద్వారా బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. Jubilee Hills రామచందర్ రావు తెలిపిన వివరాల ప్రకారం, బీజేపీ మూడు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి పార్టీ సెంట్రల్ కమిటీకి పంపనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

BJP Telangana hyderabad politics Jubilee Hills Bypoll latest news Ramachander Rao Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.