Latest News: Jubilee Hills by-election: ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం

Read Time:  1 min
 Jubilee Hills by-election
 Jubilee Hills by-election
FONT SIZE
GET APP

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల (Jubilee Hills by-election) ప్రచారం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. నవంబర్‌ 11న పోలింగ్‌ జరగనున్న సంగతి తెలిసిందే. 14న ఓట్ల కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్యే గట్టి పోటీ నెలకొంది. దాదాపు 17 రోజుల పాటు ఎన్నికల (Jubilee Hills by-election) ప్రచారం జరిగింది.

Read Also: Rajnath Singh: కాంగ్రెస్ వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ తీవ్ర స్పందన

ఇప్పటికే పలు పోల్ సర్వేలు కూడా తమ నివేదికలు విడుదల చేశాయి. కొన్ని కాంగ్రెస్‌ గెలుస్తుందని చెప్పగా.. మరికొన్న బీఆర్‌ఎస్‌ గెలుస్తాయని చెప్పాయి. మొత్తానికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మధ్యే హోరాహోరీగా పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. 

 Jubilee Hills by-election
 Jubilee Hills by-election

ఎన్నికల సంఘం 407 పోలింగ్ కేంద్రాలను సిద్ధం

జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం ఎన్నికల సంఘం 407 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా,

ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా 139 సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్లతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు.నవంబరు 11న పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం, ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాన్ని వెల్లడిస్తారు. దీంతో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.