📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Harish Rao: రైతులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం

Author Icon By Rajitha
Updated: March 18, 2026 • 2:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో మొక్కజొన్న సాగు చేసిన రైతులు పడుతున్న కష్టాలపై మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సూచనల మేరకు పంట మార్పిడి చేసి మొక్కజొన్న వేసిన రైతులకు ఇప్పుడు అన్యాయం జరుగుతోందని ఆయన మండిపడ్డారు. గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలతో కలిసి అసెంబ్లీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రైతుల కష్టాలను ప్రభుత్వం గాలికొదిలేసిందని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు.

Read also: Kavitha: వెలుగుమట్ల పేదల పోరాటం ఫలించింది: కవిత

Harish Rao expresses severe outrage, stating that farmers are suffering heavy losses.

మద్దతు ధర లేక దళారుల దోపిడీ

ప్రస్తుతం మార్కెట్లో మొక్కజొన్నకు మద్దతు ధర రూ. 2,400 ఉండగా, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు తమ పంటను దళారులకు కేవలం రూ. 1,600 నుంచి రూ. 1,700 లకే అమ్ముకుంటున్నారని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 రోజులుగా పంట మార్కెట్లకు వస్తున్నా అధికారులు స్పందించకపోవడం వెనుక దళారులకు లబ్ధి చేకూర్చే కుట్ర దాగి ఉందని ఆయన నిలదీశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

అకాల వర్షాలు

ఒకవైపు ధర లేక ఇబ్బంది పడుతుంటే, మరోవైపు అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బ తీశాయని హరీశ్ రావు పేర్కొన్నారు. వడగండ్ల వానల వల్ల మొక్కజొన్న, మామిడి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కోరారు. బడ్జెట్‌లో పంటల బీమా గురించి గొప్పగా చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆచరణలో మాత్రం రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదని విమర్శించారు. వెంటనే క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, నష్టపోయిన ప్రతి రైతుకు ఆర్థిక సాయం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

BRS protest harish rao latest news Maize Farmers Issues Revanth Reddy Telangana agriculture Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.