ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భార్య, ప్రముఖ పారిశ్రామికవేత్త నారా భువనేశ్వరికి Bhuvaneswari ప్రతిష్ఠాత్మకమైన ‘ఐఓడీ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు 2025’ లభించింది. ఈ గౌరవం అందుకున్న సందర్భంగా చంద్రబాబు (Chandrababu) తన భార్యను ప్రశంసిస్తూ ప్రేమపూర్వక సందేశం షేర్ చేశారు. “మై డియర్ భు, ఈ గౌరవం నీ కష్టానికి ప్రతిఫలం. నీ నిబద్ధత, ఆత్మవిశ్వాసం, నిజాయతీ నాకు, ఇంకా చుట్టూ ఉన్న అనేక మందికి ప్రేరణగా నిలుస్తాయి,” అని చంద్రబాబు తన పోస్ట్‌లో రాశారు.
Tirupati Crime News: భార్య కాపురానికి రావట్లేదని భర్త ఏం చేసాడంటే?
తన భర్త అభినందనలకు స్పందిస్తూ నారా భువనేశ్వరి (Bhuvaneswari) కృతజ్ఞతలు తెలిపారు. “మీరు ఎల్లప్పుడూ నాకు అండగా ఉంటారు. నా ప్రతీ విజయానికి వెనుక మీ ప్రోత్సాహమే శక్తి. Bhuvaneswari మీరు నా దారి చూపే వెలుగు,” అని ఆమె ట్వీట్‌లో (Teitter) పేర్కొన్నారు. తన జీవిత భాగస్వామిగా చంద్రబాబు ఉన్నందుకు గర్వంగా ఉందని చెప్పిన భువనేశ్వరి, “ఈ ప్రయాణాన్ని మీతో పంచుకోవడం నా అదృష్టం” అంటూ హృద్యమైన సందేశంతో ముగించారు.
నారా భువనేశ్వరి ఏ అవార్డుకు ఎంపికయ్యారు?
ఆమె “ఐఓడీ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు 2025″కు ఎంపికయ్యారు.
సీఎం చంద్రబాబు ఆమెను ఎలా అభినందించారు?
“మై డియర్ భు” అంటూ ఆమె అంకితభావాన్ని, స్ఫూర్తిదాయక వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తూ అభినందించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: