📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP Municipal Elections: మునిసిపాలిటీల్లో నేటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన

Author Icon By Rajitha
Updated: March 18, 2026 • 11:19 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : రాష్ట్రంలో 86 పురనగరపాలక సంస్థల్లో పాలక వర్గాల పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. బుధవారం నుంచి పూర్తిస్థాయిలో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమవుతుంది. 2021 మార్చిలో నిర్వహించిన ఎన్నికల్లో గెలుపొందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో అప్పట్లో కొలువు తీరాయి. పరోక్ష పద్ధతిలో పాలకవర్గ సభ్యులు వారిలో ఒకర్ని నగరపాలక సంస్థల్లో మేయర్లుగా, పురపాలక సంఘాల్లో చైర్మన్లుగా ఎన్నుకున్నారు. ఐదేళ్ల పదవీకాలం మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం వారం క్రితమే ప్రత్యేక అధికారులను నియమించింది. మంగళ, బుధవారాల్లో వీరు బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రభుత్వం నగరపాలక సంస్థల్లో ప్రత్యేక అధికారులుగా కలెక్టర్లు, పురపాలక సంఘాల్లో జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలను నియమించింది.

Read also: YS Vijayamma property : ఎన్‌సీఎల్‌ఏటీలో విజయమ్మ కీలక వాదనలు

AP Municipal Elections: Special Officers’ Rule Begins in Municipalities Today

2021 మార్చిలో ఏలూరు నగర పాలక సంస్థకు ఎన్నికలు నిర హించినా కోర్టు కేసుల కారణంగా ఓట్ల లెక్కింపు లో జాప్యమైంది. అక్కడి పాలకవర్గం పదవీ కాలం ఈఏడాది జులై 29తో ముగియనుంది. నెల్లూరు, ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, బుచ్చిరెడ్డి పాలెం, బేతంచర్ల, పెనుకొండ, కమలాపురం, రాజంపేట, కుప్పం పుర, నగరపాలక సంస్థల, నగర పంచాయతీల్లో పాలకవర్గాల పదవీ కాలం ఈ ఏడాది నవంబరు 21తో ముగియనుంది. వీటిలో రెండో విడతలో ఎన్నికలు నిర్వహించారు.

ఆర్థిక సంస్కరణలు మరియు అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ

గత వైకాపా ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పుర, నగరపాలక సంస్థల్లో గత 20 నెలల్లో అభివృద్ధికి అడుగులు పడ్డాయి. నిర్వహణ లోపంతో పెద్ద గోతుల్లా మారిన రోడ్లకు మంచి రోజులొచ్చాయి. పాడైన కాలువలకు సైతం మరమ్మతులు చేశారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర వాటా నిధులివ్వని కారణంగా అసంపూర్తిగా నిలిచిపోయిన అమృత్ పథకంలో తాగునీటి ప్రాజెక్టుల కూటమి ప్రభుత్వం వచ్చాక పనుల్లో కదలిక వచ్చింది. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు రుణంతో చేపట్టిన పనులకు మళ్లీ టెండర్లు పిలిపి పనులు ప్రారంభిస్తున్నారు. మూత పడిన అన్న క్యాంటీన్లు మళ్లీ తెరవడంతో పేదల ఆకలి బాధలు తీరుతున్నాయి.

నిధుల వ్యయంపై ప్రతిబంధకంగా ఉన్న సీఎఫ్ఎంఎస్ నుంచి పుర, నగరపాలక సంస్థలను ప్రభుత్వం మినహాయించడం వల్ల అవి ఊపిరి పీల్చుకున్నాయి. గతంలో ప్రతి పనికీ బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేసేవారు. చెల్లింపుల్లో తీవ్రమైన జాప్యంతో పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకొచ్చేవారు. ఆస్తి పన్ను, పన్నేతరాల కింద వచ్చే ఆదాయం పుర, నగరపాలక సంస్థల పరిధిలోనే ఖర్చు చేసే అవకాశం 8 నెలల క్రితం కల్పించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh District Collectors infrastructure development latest news Municipalities Special Officers Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.