📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

ఏపీ లో కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్ల కాల్‌లెటర్లు విడుదల

Author Icon By Uday Kumar
Updated: December 20, 2024 • 10:30 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సంబంధించిన దేహదారుఢ్య పరీక్షల కాల్‌లెటర్లు డిసెంబరు 18న పోలీసు నియామక మండలి విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించిన కాల్‌లెటర్లను అందుబాటులో ఉంచింది. పరీక్షలకు ఎంపికైన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, మొబైల్‌ నంబర్‌, పుట్టినతేదీ వివరాలు నమోదు చేసి కాల్‌లెటర్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. డిసెంబర్‌ 29 వరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం స్టేజ్‌-2 పీఎంటీ/ పీఈటీ పరీక్షలు డిసెంబర్‌ 30 నుంచి 2025 ఫిబ్రవరి 1 వరకు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాల్లోని ప్రధాన కేంద్రాల్లో ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 94414 50639 లేదా 91002 03323 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.

ఫిజికల్ ఈవెంట్ల షెడ్యూల్ :
???? సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు/లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి.
???? ఏపీఎస్‌సీ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి.

మెయిన్ పరీక్ష విధానం:

???? ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.
???? సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.
???? ఏపీఎస్‌పీ కానిస్టేబుల్ పోస్టులకు 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్‌కు కేటాయిస్తారు.

#AndhraPradesh #conistable #policejobs Police

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.