New CM's 'Women's Day' gift to Delhi women

ఢిల్లీ మహిళలకు కొత్త సీఎం ‘ఉమెన్స్ డే’ గిఫ్ట్

మహిళల అకౌంట్లలో రూ.2500 జమ

న్యూఢిల్లీ: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి రేఖా గుప్తా నగర ప్రజలకు శుభవార్త చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మార్చి 8 (ఉమెన్స్ డే) లోపు మహిళల అకౌంట్లలో రూ.2500 జమ చేస్తామని ప్రకటించారు. తాను ప్రజల ముఖ్యమంత్రిగా వారి మధ్యే ఉంటానని పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ నిర్మించిన అద్దాల మేడ ‘శీశ్ మహాల్‌’లో ఉండబోనని స్పష్టం చేశారు. కాసేపటి క్రితమే ఆమె రామ్‌లీలా మైదానానికి చేరుకోని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Advertisements
image

బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా పని

విద్యార్థి నాయకురాలిగా సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం సాగించిన 50 ఏళ్ల రేఖా గుప్తా ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. దీనికి ముందు బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఇటీవల జరిగి అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ (నార్త్-వెస్ట్ ) నియోజవర్గం నుంచి 68,200 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. వృత్తిరీత్యా లాయర్ అయిన 1996 నుంచి 1997 వరకూ ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థి యూనియన్ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఆ తర్వాత మున్సిపల్ రాజకీయాల్లోకి అడుగపెట్టి ఉత్తరి పితాంపుర (వార్డు 54) నుంచి 2007లో గెలిచారు. తిరిగి 2012లో ఎన్నికయ్యారు. సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా కూడా పనిచేశారు.

ప్రమాణస్వీకారం

గురవారం ఉదయం 12.05 గంటలకు రేఖా గుప్తా కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేశారు. ప్రఖ్యాత్ రామ్‌లీలా మైదాన్‌లో జరుగనున్న ఈ వేడకుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో పాటు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. 50 మందికి సీనీతారలు, పారిశ్రామిక వేత్తలతో పాటు దౌత్యవేత్తలు, బీజేపీ మిత్రపక్షాలకు చెందిన 200 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రముఖులు హాజరయ్యారు.

Related Posts
Beers: ఒక బీర్ కొంటే మరొక బీర్ ఫ్రీ
Beers: ఒక బీర్ కొంటే మరొకటి ఫ్రీ

మార్చి ప్రారంభం నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఈ సీజన్‌లో ప్రజలు దాహం తీర్చుకునేందుకు శీతలపానీయాలకు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. అయితే, మందుబాబుల కోసం ఉత్తర ప్రదేశ్‌లోని వైన్ Read more

Nagababu : జగన్ పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
జగన్ పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

Nagababu : జగన్ పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు పిఠాపురంలో జరిగిన జయకేతనం సభ సందర్భంగా జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వైసీపీ Read more

ఎన్నికల కమిషన్‌కి కేజ్రీవాల్ విజ్ఞప్తి
ఎన్నికల కమిషన్‌కి కేజ్రీవాల్ విజ్ఞప్తి

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ గురువారం ఎన్నికల కమిషన్ సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, తన న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గ ప్రత్యర్థి, Read more

ప్రభాస్ ‘స్పిరిట్’లో మృణాల్ ఠాకూర్?
mrunal prabhas

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న 'స్పిరిట్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాలో సీతారామం ఫేమ్ నటి మృణాల్ ఠాకూర్ Read more

×