हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

Nellimarla Commissioner: ఎసిబి వలలో నెల్లిమర్ల కమిషనర్

Anusha
Nellimarla Commissioner: ఎసిబి వలలో నెల్లిమర్ల కమిషనర్

రూ.15వేలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన తారకానాథ్

నెల్లిమర్ల, (విజయనగరం జిల్లా) : నెల్లిమర్ల నగరపంచాయతీ కమిషనర్ ఏ. తారక్నాథ్ మంగళవారం ఏసీబీకి చిక్కారు. పట్టణంలోని పద్మశాలివీధిలో నివసిస్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి ఇంటి నిర్మాణం నిమిత్తం ప్లాన్ అప్రూవల్ కోసం మున్సిపల్ కార్యాలయంలోని తన గదిలో రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ రమ్య అందించిన వివరాలిలా ఉన్నాయి. నెల్లిమర్ల నగర పంచాయతీ (Nellimarla Nagar Panchayat) పరిధిలోని పద్మశాలివీధిలో నివశిస్తున్న బురిడి మహేష్ అదే వీధిలో ఇల్లు నిర్మించుకుంటున్నారు. సదరు ఇంటికి ప్లాన్ అప్రూవల్ నిమిత్తం ఇటీవల దరఖాస్తు చేసుకున్నారు.

కమిషనర్ అంగీకరించలేదు

అయితే ప్లాన్ అప్రూవల్ కోసం నగర పంచాయతీ కమిషనర్ తారకానాథ్ మహేష్ నుంచి రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారు. రూ.15 వేలు నగదు రూపంలో, మిగిలిన రూ.5 వేలకు దివాన్ కాట్ బెడ్ ఇవ్వాలని కోరారు. ప్లాన్ కోసం అవసరమైన ఫీజు చెల్లించానని, లంచం ఇవ్వలేనని మహేష్ ప్రాధేయపడ్డారు. అయినా సరే కమిషనర్ అంగీకరించలేదు. దీంతో మహేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో నగర పంచాయతీ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్కు వెళ్లిన మహేష్ రూ.15 వేలు అందజేశారు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రమ్య (ACB DSP Ramya) ఆధ్వర్యంలో సిబ్బంది రెడ్ హ్యాండెడ్గా కమిషనర్ తారకానాథ్ ను, పట్టుకున్నారు.

Nellimarla Commissioner: ఎసిబి వలలో నెల్లిమర్ల కమిషనర్
Nellimarla Commissioner: ఎసిబి వలలో నెల్లిమర్ల కమిషనర్

అనేక ఆరోపణలు

కేసు నమోదు చేశామని, బుధవారం కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు. నగర పంచాయతీ కమిషనర్ తారక్నాథ్ (Tarakanath) పై మొదటి నుంచి అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణంలో నిర్మాణంలో ఉన్న ప్రతి భవనం వద్దకు వెళ్లి లంచాలు డిమాండ్ చేసినట్లు విమర్శలు గుప్పుమన్నాయి. ఇదే విషయాన్ని గత మూడు దఫాలుగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో సభ్యులు ప్రస్తావించారు. ఒకానొక సందర్భంలో బాధితులతోనే నేరుగా సమావేశాల్లో చెప్పించారు. అయినా సరే కమిషనర్ తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. అంతా సవ్యంగా జరిగితే ఈ నెలాఖరుకు ఆయన ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఇంతలోనే ఏసీబీ అధికారులకు పట్టుబడటం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

నెల్లిమర్ల దేనికి ప్రసిద్ధి?

నెల్లిమర్ల జనపనార మిల్లు ఆంధ్రప్రదేశ్‌లోని అతిపెద్ద వాటిలో ఒకటి. దీనికి జగదీష్ సర్దా ఛైర్మన్‌గా ఉన్నారు. ఇది కొంతకాలం క్రితం గోల్డెన్ మిల్ అని పిలువబడే సాకింగ్ యూనిట్. దీని బస్తాలు ప్రీమియం నాణ్యత కలిగి ఉంటాయి. భారతదేశంలోని అత్యుత్తమమైన వాటిలో ఒకటి.

నెల్లిమర్ల ఎమ్మెల్యే ఎవరు?

లోకం నాగ మాధవి 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో జనసేన పార్టీ నుండి గెలిచి ప్రస్తుత నియోజకవర్గం ఎమ్మెల్యే .

Read hindi news: hindi.vaartha.com

Read Also: TTD: అలిపిరి పాదాలమండపంలో ఆలయ శుద్ధి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ధనుర్మాసం 2025: APSRTC ప్రత్యేక బస్సులు..

ధనుర్మాసం 2025: APSRTC ప్రత్యేక బస్సులు..

ఏపీలో వారికి రూ.5వేలు

ఏపీలో వారికి రూ.5వేలు

భద్రతకు భారీ పెట్టుబడి.. పోలీసు శాఖలో రూ.1000 కోట్ల ప్రాజెక్టులు

భద్రతకు భారీ పెట్టుబడి.. పోలీసు శాఖలో రూ.1000 కోట్ల ప్రాజెక్టులు

రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్: రూ.1 లక్ష రుణం

రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్: రూ.1 లక్ష రుణం

రాజధాని పరిధిలోని భూమిలేని పేదలకు

రాజధాని పరిధిలోని భూమిలేని పేదలకు

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే

పొట్టి శ్రీరాములు వర్ధంతి.. నివాళి అర్పించిన సీఎం

పొట్టి శ్రీరాములు వర్ధంతి.. నివాళి అర్పించిన సీఎం

అనకాపల్లిలో వ్యూహాత్మక అణు పరిశోధనలకు కొత్త కేంద్రం

అనకాపల్లిలో వ్యూహాత్మక అణు పరిశోధనలకు కొత్త కేంద్రం

అమరావతిలో రూ.165 కోట్లతో జ్యుడీషియల్ అకాడమీ భవనం

అమరావతిలో రూ.165 కోట్లతో జ్యుడీషియల్ అకాడమీ భవనం

తిరుపతి–చిత్తూరు జిల్లాల్లో నో హెల్మెట్ నో పెట్రోల్ అమలు

తిరుపతి–చిత్తూరు జిల్లాల్లో నో హెల్మెట్ నో పెట్రోల్ అమలు

పండిన ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది

పండిన ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది

మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు

మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు

📢 For Advertisement Booking: 98481 12870