‘ఇండియా’ ఎన్నికల్లో పోటీ కోసం కాదు: ఫరూక్ అబ్దుల్లా

Read Time:  1 min
farooq abdullah
farooq abdullah
FONT SIZE
GET APP

ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్‌ శాశ్వతమని జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా అన్నారు. ఈ కూటమి కేవలం ఎన్నికల్లో పోటీ చేయడం కోసమే కాదని తెలిపారు. దేశాన్ని బలోపేతం చేయడం, ద్వేషాన్ని తొలగించడం కోసమని చెప్పారు. ఈ కూటమి కేవలం ఎన్నికల్లో పోటీ చేయడం కోసమే కాదని తెలిపారు. దేశాన్ని బలోపేతం చేయడం, ద్వేషాన్ని తొలగించడం కోసమని చెప్పారు. ‘ఇండియా’ బ్లాక్‌లో భాగమైన ఆప్‌, కాంగ్రెస్‌ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పరస్పరం తలపడుతున్నాయి.

ఈ కూటమికి చెందిన టీఎంసీ, శివసేన (యూబీటీ) వంటి పార్టీలు ఆప్‌కు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ‘ఇండియా’ కూటమి ఐక్యత, మనుగడపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేవలం లోక్‌సభ ఎన్నికల కోసమే అయితే ఈ కూటమిని ముగించవచ్చని ఫరూక్‌ అబ్దుల్లా కుమారుడు, జమ్ముకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా గురువారం సూచించారు.
కాగా, ఈ పరిణామాల నేపథ్యంలో ‘ఇండియా’ కూటమి భవిష్యత్తు గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ఫరూక్ అబ్దుల్లా సమాధానమిచ్చారు. ఈ కూటమి కేవలం ఎన్నికల్లో పోటీ చేయడం కోసం కాదని తెలిపారు. దేశాన్ని బలోపేతం చేయడం, ద్వేషాన్ని తొలగించడం కోసమని చెప్పారు. ‘ఈ కూటమి శాశ్వతం. ఇది ప్రతి రోజు, ప్రతి క్షణానికి సంబంధించినది’ అని అన్నారు. అయితే ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్రంతో పోరాటం చేయదని తెలిపారు. జమ్ముకశ్మీర్‌ సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని స్పష్టం చేశారు.

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.