Zomato Platform Fee Hike: జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజు పెంపు: నేటి నుంచి కొత్త ధరలు ఇవే!

Read Time:  1 min
Zomato Platform Fee Hike: Zomato platform fee hike: These are the new prices from today!
Zomato Platform Fee Hike: Zomato platform fee hike: These are the new prices from today!
FONT SIZE
GET APP

Zomato Platform Fee Hike: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో (Zomato) తన వినియోగదారులపై మరోసారి ఆర్థిక భారాన్ని మోపింది. ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచుతూ కంపెనీ తీసుకున్న నిర్ణయం నేటి నుంచి (మార్చి 20, 2026) అమల్లోకి వచ్చింది. కార్యకలాపాల నిర్వహణ ఖర్చులు పెరగడం, అంతర్జాతీయంగా చమురు ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read Also : North Korea: డ్రోన్‌లను తిప్పికొట్టగల కొత్త ట్యాంక్‌ను నడిపిన కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె

ఎంత పెరిగింది?

జొమాటో ప్రతి ఆర్డర్‌పై వసూలు చేసే ప్లాట్‌ఫామ్ ఫీజును రూ. 2.40 మేర పెంచింది.

Zomato Platform Fee Hike: Zomato platform fee hike: These are the new prices from today!
Zomato Platform Fee Hike: Zomato platform fee hike: These are the new prices from today!
  1. పాత ఫీజు: రూ. 12.50
  2. కొత్త ఫీజు: రూ. 14.90 (జీఎస్‌టీ కాకుండా)

పన్నులతో (GST) కలిపి చూస్తే వినియోగదారులు ప్రతి ఆర్డర్‌పై దాదాపు రూ. 17.50 వరకు కేవలం ప్లాట్‌ఫామ్ ఫీజు రూపంలోనే చెల్లించాల్సి ఉంటుంది. గత ఏడాది సెప్టెంబర్‌లో రూ. 12.50 కి పెంచిన కంపెనీ, ఆరు నెలలు గడవకముందే మళ్ళీ పెంచడం గమనార్హం.

యూజర్లపై ప్రభావం

జొమాటో గోల్డ్ (Zomato Gold) సభ్యులకు ఉచిత డెలివరీ సౌకర్యం ఉన్నప్పటికీ, ఈ ‘ప్లాట్‌ఫామ్ ఫీజు’ మాత్రం అందరికీ వర్తిస్తుంది. దీనివల్ల ప్రతి చిన్న ఆర్డర్ విలువపై కూడా అదనపు భారం పడనుంది. స్విగ్గీ (Swiggy) వంటి ప్రత్యర్థి సంస్థలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఎందుకు పెంచుతున్నారు?

ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం వల్ల డెలివరీ ఖర్చులు అధికమయ్యాయి. దీనికి తోడు కంపెనీ లాభదాయకతను (Profitability) పెంచుకోవడంలో భాగంగా ఈ తరచుగా ఫీజులను సవరిస్తోంది. 2023లో కేవలం రూ. 2 తో మొదలైన ఈ ఫీజు, మూడేళ్లలోనే రూ. 15 కి చేరువవ్వడంపై వినియోగదారులు సామాజిక మాధ్యమాల్లో అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.