📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu news : youth :యువత సామాజిక బాధ్యతను గుర్తెరగాలి

Author Icon By Sudha
Updated: October 7, 2025 • 3:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నేటి విద్యార్థులే భావిభారత పద నిర్దేశకులు. రేపటి సమాజానికి మార్గదర్శకులు, విద్యార్థులు ఆదర్శవంతమైన యువతిగా రూపుదిద్దుకొని ఒక నీతి నిజాయితీ, నిబద్ధతతో కూడిన వ్యవస్థను రూపొందిస్తారని వారి పైన తల్లిదండ్రులకే కాదు అందరికీ ఉండే ఒక ఆశావహ అభిప్రాయం, ఆకాంక్ష. ఉన్నతమైన ఆశయాలతో మెరుగైన సమాజాన్ని నిర్మిస్తారని వీరిపై అందరికీ ఉండే ఒక సహజమైన విశ్వాసం కానీ కొద్ది సంవత్సరాలుగా పరిశీలిస్తే విద్యార్థులు
రకరకాల దురలవాట్లకులోనై చెడు మార్గం పట్టడం గమ నించవచ్చు. కారణాలు ఏమైనా కావచ్చు. కానీ రేపటి రోజు కు వీరు ఆశాకిరణం లాగాకాక సంఘ వ్యతిరేక శక్తులుగా కూడా తయారవుతున్నట్లు మనకు అవగతమవుతున్నది. ముఖ్యంగా విద్యార్థులు గంజాయి లాంటి మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం చాలా తర చుగా వింటున్నాం. కొద్దిమంది మరో అడుగు ముందుకేసి వాటి స్మగ్లింగ్ కూడా పట్టుబడుతున్నారు. ఇలాంటి సంఘటనల వల్ల కాబోయే యువతపై (youth)మనం పెంచుకున్న విశ్వాసం సన్నగిల్లుతున్నది. ఇలాంటి దురలవాట్లకు లోనై వారు చివరకు సంఘవిద్రోహశక్తులుగా మారే ప్రమాదం ఉంది. ఇలాంటి ప్రవర్తనను ముందే పసిగట్టి కౌన్సిలింగ్ ద్వారానో కఠిన చర్యల ద్వారానో అరికట్టాల్సిన ఆవశ్యకత బాధ్యత తల్లిదండ్రులపైన, అధ్యాపకులపైన ఎంతో ఉంది. ఎన్ని
చట్టాలున్నా, ఎన్ని చర్యలున్నా తగ్గకుండా నడుస్తున్న మరో దురలవాటు ర్యాగింగ్. కేవలం సీనియర్లు జూనియర్ల మధ్యన ఒక పరిచయం స్నేహభావం వెల్లివిరియాలనే సదు దేశంతో మొదలైన ఈ ప్రక్రియ విద్యార్థిలోకాన్ని ఒక జాడ్యం లాగా ఆవహించింది. వారి జీవితాలను క బళిస్తున్నది. సీనియర్లు జూనియర్ విద్యార్థులను వికృత క్రీడలతో విచిత్ర మైన చేష్టలతో దానిని వింత పుంతలు తొక్కించారు. పర్య వసానంగా ఈ బాధను తట్టుకోలేకపోయిన సున్నిత మనస్కులు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్న సంఘటనలు మనకు తెలుసు. పోలీసు కేసులు రిజిస్టర్ అవుతున్నా, టిసి లు ఇచ్చిన సంఘటనలున్నా ఈ ర్యాగింగ్ రోగం తగ్గిన దాఖలాలు లేవు. రకరకాల రూపాలలో విశృంఖలంగా సాగుతూనే ఉన్నది. దీనిని సంపూర్తిగా సమూలంగా అరికట్టక పోతే ఈ దుష్ట సంస్కృతిని నిర్మూలించకపోతే మరిన్ని విలువైన ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.

youth :యువత సామాజిక బాధ్యతను గుర్తెరగాలి

ర్యాగింగ్ కేసులు

నాగర్ కర్నూల్ సూర్యాపేట, మెడికల్ కళాశాలలో సంఘటనలు సమాజాన్ని కదిలించి వేశాయి. చిత్తూరు జిల్లాలోనూ సీనియర్లు ఒక జూనియర్ విద్యార్థిని తమ రూములో చిత్రహింసలకు గురిచేసి తాము చేసిన ఘనకార్యాన్ని వీడియో కూడా తీయడం దారుణం. కళాశాల యాజమాన్యం కూడా ఇలాంటి సంఘటనల్లో మౌనం పాటించడం శోచనీయం. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దవలసిన అధ్యాపకులు, యాజమాన్యం తగిన సమయంలో స్పందించకపోతే దాని పరిణామాలు అనూహ్యంగానే ఉంటాయి. గత తొమ్మిది ఏళ్ల వ్యవధిలో 2024-25 సంవత్సరంలో అత్యధికంగా ర్యాగింగ్ కేసులు నమోదు కావడం బాధాకరం. 2022-24 మధ్య 51 ఆత్మహత్యలు కేవలం ర్యాగింగ్ వల్లనే జరిగినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. వృత్తి విద్యాకళాశాలలు ర్యాగింగ్కు కేంద్రా లుగా నిలపడం బాధాకరం. విద్యార్థులు యువత తామను కున్నవి జరగకపోతే తట్టుకోలేకపోతున్నారు. మానసికంగా కృంగిపోతున్నారు. అది వారికి ఇష్టమైన కోర్సు కావచ్చు, ఉద్యోగం కావచ్చు. తనకు నచ్చిన మొబైల్ కొనివ్వలేదని ఆత్మహత్యలకు పాల్పడిన వారు, మొబైల్ వాడనివ్వలేదని కూడా మరికొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్న సంఘటనలు మనం చదువుతున్నాం. విద్యార్థులు ఈ రకంగా సున్నిత మనస్కులుగా తయారు కావడం వారి భవిష ్యత్తుకు మంచిది కాదు. తల్లిదండ్రులు కూడా వారిని ఆ విధంగా పెంచకూడదు. తాము అనుకున్న మార్కులు రాలేదనిర్యాంకు రాలేదని కూడా తీవ్రచర్యలకు పాల్పడుతున్నారు. మార్కు లు, ర్యాంకు, కోర్సు ఇవి మాత్రమే జీవితం కాదనేది వారు గుర్తించాలి. పాఠశాలల్లో కళాశాలల్లో కూడా వారికి తరచుగా కౌన్సిలింగ్ తరగతులు నిర్వహించుతూ వారిని దృఢ మనుస్కులుగా తయారు చేయాలి. పరీక్షలు మార్కులు ర్యాంకులు వస్తుంటాయి. పోతుంటాయి. కానీ జీవితం ఒకటేనని వారు గుర్తించేలా చేయాలి ఒంటరిగా తిరిగేవాళ్లను అన్యమనస్కంగా ఉండే వారి మీద ఒక కన్నేసి ఉండాలి. అనుమానాస్పద ప్రవర్తనను పరిశీలిస్తూ ఉండాలి.

వైఫల్యాలే భవిష్యత్తులో విజయాలకు సోపానాలు

ఉద్యోగార్థులు తమ ప్రయ త్నంలో విఫలమైతే విరక్తిచెందుతారు. మరోమారుప్రయత్నం చేసి సాధించవచ్చుననే మనోధైర్యం వారిలో కల్పించాలి. వైఫల్యాలే భవిష్యత్తులో విజయాలకు సోపానాలని వారికి బోధించాలి. వారికి జీవితంపై ఆశ కలిగేలా చేయాలి. ఉద్యోగమే కాదు ఉపాధి అవకాశాలు గూర్చి వారికి అవగాహన కల్పించి, అవకాశాల గూర్చి కూడా వారికి తెలియజేసి వారి ని ఆ దిశగా ఆలోచింపజేయాలి. జీవిత సత్యాలను, జీవన నైపుణ్యాలను వారికి నేర్పడం ద్వారా సమాజానికి ఉపయో గపడేలా వారిని తీర్చిదిద్దవచ్చు. మరి కొందరు ప్రేమ విఫల మైందనే మనోవ్యధలో కూడాకృంగిపోతున్నారు. తల్లిదండ్రు లకు సమాజానికి భారంగా మిగిలిపోతున్నారు. అలాంటి వారి మనసు మళ్లించి మంచి వ్యాపకంలో వారినితీరిక లేకుండా ఉండాలి. వారి అభిరుచిని బట్టి పని అప్పగిస్తే వారు ఇష్టపూర్తిగా చేసి విజయాన్ని ఆస్వాదిస్తారు. ఒత్తిడిని జయించే శక్తి సామర్ధ్యాలు కలిగేలా చేయడం ద్వారా విద్యా
ర్డులను యువతను (youth)సన్మార్గంలో పెట్టి వారితోనే సమాజం లో మార్పు తీసుకురావచ్చు. సామాజిక సేవ, రాజకీయాల వంటివి కూడా వారిని సరైన దిశలో నడిపిస్తాయి. వారి శక్తి వారు తెలుసుకునేలా చేయడంలోనే విజయ రహస్యం దాగి ఉంది. దేశం గర్వించదగిన ఎందరో మహానుబావుల చరిత్ర లు చదివించడం ద్వారా వారిలో జీవితం పట్ల ఆసక్తిని కలిగించవచ్చు. సమాజంపట్ల బాధ్యతను పెంచవచ్చు. విద్యా ర్థులలో యువతలో ఎందుకింత
నైరాశ్యం ఆవహించింది? అసలు వారి చదువుల్లోనే ఏదో ఒక లోపం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. భాషల పట్ల నిర్లక్ష్యం పెరిగింది. భాషా వాచకాలలో ఎన్నో నీతి కథలు, ఆదర్శ పురుషుల జీవిత గాధలు, జీవన నైపుణ్యాలు నేర్పే విషయాలు ఇంకా జీవన విధానం తెలిపే అనేక విషయాలు ఉంటాయి. మారిన కాల మాన పరిస్థితులలో తరగతి బోధనలో భాషలు మూలన పడ్డాయి. ప్రాముఖ్యత కోల్పోయాయి. కంప్యూటర్ యుగం కావడంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే టెక్నికల్ కోర్సులకు డిమాండ్ సహజంగానే పెరిగింది.

youth :యువత సామాజిక బాధ్యతను గుర్తెరగాలి

అన్యాయాన్ని ఎదిరించాలి

గ్రంథాలయా ల్లో పుస్తకాలకు చెదలు పట్టాయి. పుస్తక పఠనం విద్యార్థుల్లో యువతలో పూర్తిగా పడిపోయింది. అందువల్ల వారు మానసిక దుర్భలులవుతున్నారు. చదువు, మొబైల్, టీవీ, కంప్యూటర్ ఇంతకుమించి వారికి వేరే ప్రపంచం లేకుండా పోయింది. అందులోనే వారు ఆనందాన్ని వెతుక్కుంటున్నా రు. ఆప్తులైన స్నేహితుడు కూడా కరువయ్యారు. ఆటలు ఏనాడో మరిచిపోయారు. శారీరక వ్యాయామం, శ్రమ పూర్తిగా మరుగున పడింది. ఆటంటే నేడు క్రికెట్ మాత్రమే. ఆట ల ద్వారా స్నేహభావం గెలుపోటములు వాటి విలువ తెలు స్తుంది. క్రీడాస్పూర్తిని జీవితంలో కూడా ఉపయోగించగలు గుతారు. పాఠశాలల్లో కళాశాలల్లో గత నాలుగు దశాబ్దాలు గా ఎన్నికలు లేకుండా చేశారు. దాంతో వారికి సామాజిక స్పృహ, ప్రతినిధులు, చట్టసభలు, చర్చలు ఇంకా వాదనల లాంటి వాటికి దూరమయ్యారు. రాజకీయ జ్ఞానం కూడా బొత్తిగా కొరవడుతున్నది. సామాజిక శాస్త్రాల పట్ల పాలకుల నిర్లక్ష్య ధోరణి దీనిని మరింత
పెంచింది. సామాజిక బాధ్యత కూడా యువత నేడు గ్రహించడం లేదు. చదువు లక్ష్యం కేవలం ఉద్యోగమే కాదని జీవితాన్ని అర్థవంతంగా ఆనందంగా జీవించడమని వారు గుర్తించాలి. ఈ యువత (youth)దేశాన్ని ఉద్దరించుతుందన్న ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. భూమి ఆకాశాలను ఏకం చేసే సత్తా కూడా వారికి ఉంది. పట్టుదల, వైద్యం వారి సొంతం. వారి ఆలోచనల ను సరైన దిశలో మళ్ళిస్తే వారు అద్భుతాలు సృష్టించగలు గుతారు. హత్యలు, ఆత్మహత్యల లాంటి వాటికి జోలికి పోకుండా తమ ఉన్నత స్థితి, సామాజిక పురోగతి లాంటి వాటికి బాటలు వేయాలి. సామాజిక స్థితిగతులను వారు అధ్యయనం చేయాలి. అన్యాయాన్ని ఎదిరించాలి. అక్రమాల కు అడ్డుకట్టు వేయాలి. కులమత రహిత సమాజానికై తమ వంతు పాత్ర పోషించాలి. చిన్న చిన్న విషయాలకి కృంగి పోతే, కునారిల్లితే వారు ముందుకు
సాగలేరు. ముళ్ళదారు లను పూలదారులుగా మలుచుకుంటూ వారి ప్రయాణం సాగాలి. యువతే నవ సమాజాన్ని నిర్మించాలి.


-శ్రీశ్రీ కుమార్

సమాజంలో యువత యొక్క ప్రాముఖ్యత?

యువత స్థానిక సమాజాలలో అంతర్భాగం. వారు దాని సంస్కృతిని రూపొందించడంలో సహాయపడతారు మరియు వారికి విస్తృతమైన సామాజిక సంబంధాలు ఉంటాయి. యువత ఒక సమాజం యొక్క సమస్యలను ప్రత్యక్షంగా అనుభవించినట్లే, వారు తరచుగా క్రియాశీలత మరియు వాటిని పరిష్కరించడంలో సహాయపడే ఇతర ప్రయత్నాలలో ముందు వరుసలో ఉంటారు.

యువత యొక్క ప్రధాన ఆలోచన ఏమిటి?

బాల్యం యొక్క ఆధారపడటం నుండి యుక్తవయస్సు యొక్క స్వాతంత్ర్యానికి పరివర్తన కాలంగా యువతను బాగా అర్థం చేసుకోవచ్చు. అందుకే, ఒక వర్గంగా, యువత ఇతర స్థిర వయస్సు సమూహాల కంటే ఎక్కువ ద్రవంగా ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News Community Service latest news social responsibility Telugu News Youth youth awareness Youth empowerment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.