📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Scientists: దృఢ సంకల్పంతో యువశాస్త్రవేత్తలు అడుగులు వేయాలి

Author Icon By Sharanya
Updated: August 12, 2025 • 5:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అత్తాపూర్ (హైదరాబాద్): యువశాస్త్రవేత్తలు అంకిత భావంతో పని చేస్తూ రైతులకు సహాయ, సహకారాలు అందించాలని పలువురు ముఖ్యఅతిథులు పేర్కొన్నారు. (ఎఫ్ఎసీ ఎఆర్ఎస్)ను రాజేంద్రనగరలోని ఐసీఎఆర్ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ (నారం)లో ప్రారంభించారు. కొత్తగా నియమించిన 108 మంది శాస్త్రవేత్తలు (108 scientists)ఆగస్టు -నవంబర్ మధ్య నిర్వహించే కోర్సులో చేరారు. మొత్తం 108 మంది ప్రొబేషనర్లు, 73 మంది పురుషులు మరియు 35 మంది మహిళలు, దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలకు మరియు 35 వ్యవసాయ విభాగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Scientists

కొత్త శాస్త్రవేత్తలకు శిక్షణ కార్యక్రమం

ఈ సందర్భంగా వ్యవసాయ పరిశోధన సేవలు(ఎఆర్ఎస్)లో కొత్తగా నియమించిన శాస్త్రవేత్తలకు దిశానిర్దేశం చేయడానికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ సభ్యుడు డాక్టర్చబిలేంద్ర రౌల్ మాజీ కార్యదర్శి, డిఓఎఫ్, ఎంఓసీఎఫ్, మరియు మాజీ ప్రత్యేక కార్యదర్శి, డేర్ఐసీఎఆర్ కార్యదర్శి, న్యూఢిల్లీ, ముఖ్యఅతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు మరియు సమాజానికి ప్రత్యక్ష ప్రయోజనాలను అందించే ప్రాథమిక మరియు అనువర్తిత పరిశోధనలను కొనసాగించాలని ఆయన ప్రొబేషనరీ శాస్త్రవేత్తలను కోరారు. గౌరవ అతిథిగా హాజరైన న్యూఢిల్లీ(New Delhi)లోని ఐసిఎఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఫిషరీస్ సైన్స్ అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్) డాక్టర్ జోయ్ క్రుష్ణ జెనా, ఆధునిక వ్యవసాయ వ్యవస్థలలోని సవాళ్లు మరియు అవకాశాలపై ఆయన ఆలోచనలను పంచుకున్నారు.

మరో గౌరవ అతిథిగా విచ్చేసిన అరుణ్ తివారీ, మిస్సైల్ సైంటిస్ట్ (రిటైర్డ్), రచయిత, మాజీ డిఆర్డిఓ డైరెక్టర్, హైదరా బాద్లోని కేర్ ఫౌండేషన్ డైరెక్టర్, వ్యవసాయ శాస్త్రవేత్తలను దేశంలోని గొప్ప వనరులలో ఒకరు గా అభివర్ణించారు. అంకితభావం మరియు గర్వంతో పనిచేయాలని ఆయన వారిని కోరారు. నారం యాక్టింగ్ డైరెక్టర్, డాక్టర్ గోపాల్ లాల్, ఐసీఎఆర్ వ్యవస్థలో చేపట్టిన ప్రభావవంతమైన పరిశోధన కార్యక్రమాల గురించి మాట్లాడారు. ముందుగా కోర్సు సమన్వయకర్త డాక్టర్ డి.దామోదర్ రెడ్డి స్వాగతం పలికారు. 115వ ఫోకర్స్ కోర్సు సమన్వయకర్త డాక్టర్ ఎం. రమేష్ నాయక్ కృత జతలు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అకాడమీ శాస్త్రవేత్తలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Read also:

Breaking News determination Future Scientists Indian Science innovation latest news Scientific Research Telugu News Young Scientists Youth in Science

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.