దేశ ప్రజాస్వామ్యంలో పౌర హక్కుల పరిరక్షణ అత్యంత ప్రాధాన్యమైన అంశం. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇటీవల ఒక కీలక తీర్పు ఇచ్చింది. “కారణాలు చెప్పకుండా ఎవ్వరినీ అరెస్టు చేయకూడదు” అని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టంగా పేర్కొంది.
Read Also: Bihar Election: బీహార్‌లో మా పార్టీయే గేలుస్తుంది:ప్రశాంత్ కిశోర్
ఎందుకు అరెస్టు చేశారు? FIRలో ఏం రాశారు? ఏ చట్టాలను ప్రస్తావించారో నిందితులకు చెప్పాలని తేల్చి చెప్పింది. ‘అరెస్టుకు ముందు లేదా అరెస్టయిన తక్షణమే కారణాలు చెప్పాలి. 2 గంటల్లోపే మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగలిగితే ఇది వర్తించదు’ అని తెలిపింది. తన అరెస్టుకు కారణాలు చెప్పలేదంటూ మిహిర్ రాజేశ్(ముంబై) వేసిన కేసులో (Supreme Court) ఈ తీర్పు వెల్లడించింది.ఈ తీర్పు భారత రాజ్యాంగంలోని వ్యక్తిగత స్వేచ్ఛ, న్యాయ హక్కుల పరిరక్షణలో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: