📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Yash Dayal: లైంగిక ఆరోపణలతో యశ్ దయాల్‌ పై నిషేధం!

Author Icon By Anusha
Updated: August 11, 2025 • 3:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయానికి ముఖ్య కారణంగా నిలిచిన స్టార్ బౌలర్‌ యశ్ దయాల్ (Yash Dayal) ప్రస్తుతం తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. ఐపీఎల్‌లో తన అద్భుత ప్రదర్శనతో అభిమానులను, క్రికెట్ విశ్లేషకులను ఆకట్టుకున్న యశ్ దయాల్ ఇప్పుడు ఒక పెద్ద వివాదంలో ఇరుక్కున్నాడు. 17 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు రావడంతో అతని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఆరోపణల నేపథ్యంలో అతడిని ఒక కీలక లీగ్ నుంచి నిషేధించారు. ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (UPCA) అతడిని రాబోయే యూపీ టీ20 లీగ్ నుంచి నిషేధించింది. యశ్ దయాల్‌పై 17 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు రాగా.. యూపీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో అతని క్రికెట్ కెరీర్ కు ప్రమాదం ఏర్పడింది.

స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.

ఈ నిర్ణయం వల్ల యూపీ టీ20 లీగ్‌లో గోరఖ్‌పూర్ లయన్స్ జట్టు యశ్ దయాల్‌ను రూ. 7 లక్షలకు కొనుగోలు చేసినప్పటికీ, ఈ సీజన్‌లో అతను ఆడలేడు. యశ్ దయాళ్‌పై జైపూర్‌లోని సాంగనేర్ సదర్ పోలీస్ స్టేషన్‌లో మైనర్‌ బాలికపై లైంగిక దాడి కేసు నమోదైంది. ఈ కేసులో రాజస్థాన్ హైకోర్టు (Rajasthan High Court) నుంచి అతనికి ఎలాంటి ఉపశమనం లభించలేదు. ఇది మైనర్‌కు సంబంధించిన కేసు కాబట్టి, అతని అరెస్టుపై స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 22న జరగనుంది. కోర్టు నుండి ఉపశమనం లభించకపోవడంతో యశ్ అరెస్టుకు అవకాశాలు పెరిగాయి. వాస్తవానికి యశ్ దయాల్‌పై లైంగిక వేధింపులు రావడం ఇది రెండోసారి.

Yash Dayal:

లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి

గతంలో ఘజియాబాద్‌కు చెందిన ఒక మహిళను వివాహం చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులో అలహాబాద్ హైకోర్టు యశ్ దయాల్ అరెస్టుపై స్టే విధించింది. కానీ ఇప్పుడు జైపూర్‌లో నమోదైన కొత్త కేసు యశ్ దయాల్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. ఇదిలా ఉండగా.. యశ్ దయాల్ ఇటీవల ఐపీఎల్ 2025లో ఆర్సీబీ తరఫున మంచి ప్రదర్శన చేసి 15 మ్యాచ్‌లలో 13 వికెట్లు పడగొట్టి జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే యశ్ దయాల్‌పై వచ్చిన ఈ తీవ్రమైన ఆరోపణల కారణంగా అతని భవిష్యత్తు ప్రస్తుతం అనిశ్చితిలో ఉంది.

యశ్ దయాల్ ఏ జట్టుకు ఐపీఎల్ 2025లో ప్రాతినిధ్యం వహించాడు?

ఐపీఎల్ 2025 సీజన్‌లో యశ్ దయాల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

యశ్ దయాల్‌పై ఏ ఆరోపణలు వచ్చాయి?

యశ్ దయాల్‌పై 17 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు వచ్చాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/crystal-palace-vs-liverpool-community-shield-highlights/sports/528822/

Breaking News cricket career in danger latest news minor girl rape case rcb bowler ban sexual assault allegations Telugu News up t20 league suspension upca decision yash dayal controversy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.