Latest News: Tej Pratap Yadav: తేజ్ ప్రతాప్ యాదవ్ కు వై ప్లస్ భద్రత

Read Time:  1 min
Tej Pratap Yadav
Tej Pratap Yadav
FONT SIZE
GET APP

బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections 2025) వేళ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, జనశక్తి జనతాదళ్ (జేజేడీ) చీఫ్ తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) తన భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Read Also: Jammu and Kashmir: డాక్టర్లుగా మారిన టెర్రరిస్టులు..బాంబులు  తుపాకులు స్వాధీనం

తనకు ప్రాణ హాని ఉందని చెప్పారు. చుట్టూ ఉన్న ఎవరిని చూసినా శత్రువుల్లాగే అనిపిస్తోందని పేర్కొన్నారు. ఈక్రమంలోనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. తేజ్ ప్రతాప్ యాదవ్‌ (Tej Pratap Yadav) కు అత్యున్నతమైన ‘వై ప్లస్’ (Y+) కేటగిరీ భద్రతను మంజూరు చేసింది. ఇకపై కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) బృందం ఆయనకు రక్షణ కల్పిస్తుంది.

Tej Pratap Yadav
Tej Pratap Yadav

‘వై ప్లస్ (Y+)’ కేటగిరీ సెక్యూరిటీ మంజూరు

పాట్నాలో మీడియాతో మాట్లాడిన తేజ్ ప్రతాప్ యాదవ్.. తన భద్రత పెంపుదలపై స్పందిస్తూ ప్రాణహాని ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. “నా ప్రాణాలకు ముప్పు ఉండటం వల్లే నా భద్రతను పెంచారు. నన్ను చంపేస్తారు. చుట్టూ ఉన్న ప్రజలంతా నాకు శత్రువుల్లాగే కనిపిస్తున్నారు. శత్రువులు చాలా మంది ఉన్నారు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే ఆ శత్రువులు ఎవరనే వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. భద్రతా సంస్థలు ఇటీవల హోం మంత్రిత్వ శాఖకు సమర్పించిన ముప్పు అంచనా నివేదిక ఆధారంగానే తేజ్ ప్రతాప్ భద్రతను పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.