Subarnarekha River- AN-M64 Bomb: ఝార్ఖండ్ రాష్ట్రం తూర్పు సింగ్‌భమ్ జిల్లాలోని, బహరాగోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని పానిపాడా-నాగుడ్‌సాయి ప్రాంతంలో, సువర్ణరేఖ నదీ తీరంలో ఇసుక తవ్వకాలు జరుపుతుండగా ఒక భారీ బాంబు బయటపడింది. గ్యాస్ సిలిండర్ ఆకారంలో ఉన్న ఈ బాంబును చూసి స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
Read Also: DGCA New Rules: 60% సీట్లపై అదనపు ఛార్జీల రద్దు..కేంద్రం ఆదేశాలపై ఎయిర్‌లైన్స్ ఆగ్రహం!
Subarnarekha River- AN-M64 Bomb: 227 కిలోల అమెరికా తయారీ బాంబు
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, ఈ బాంబుపై ‘AN-M64 500 lb American-made’ అని రాసి ఉంది. ఇది సుమారు 227 కిలోల బరువు కలిగి ఉంది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా దళాలు దీనిని ఇక్కడ వదిలివేసి ఉంటారని నిపుణులు భావిస్తున్నారు. రాంచీ నుంచి వచ్చిన బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDDS) దీనిని క్షుణ్ణంగా పరిశీలించి, ఈ బాంబు ఇంకా యాక్టివ్‌గా (సజీవంగా) ఉందని ధృవీకరించడం గమనార్హం.
ప్రజలు ఎవరూ దాని దగ్గరకు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేశారు. రాంచీ నుంచి వచ్చిన బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDDS) దీనిని పరిశీలించి, ఇది ఇంకా యాక్టివ్‌గా ఉందని నిర్ధారించింది. అయితే, ఇంత భారీ, పాతతరం బాంబును నిర్వీర్యం చేసే నైపుణ్యం తమకు లేదని వారు స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో, తూర్పు సింగ్‌భమ్ ఎస్పీ (రూరల్) రిషవ్ గార్గ్ సైన్యంలోని బాంబ్ డిస్పోజల్ విభాగానికి అధికారికంగా లేఖ రాశారు. పశ్చిమ బెంగాల్‌లోని కలైకుండా వైమానిక దళ స్థావరం సహాయాన్ని కూడా కోరారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసి, సైనిక బృందం కోసం ఎదురుచూస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: