మహిళల ప్రపంచ కప్ 2025లో(WomenCricket2025) పోటీ తీవ్రంగా మారుతోంది. ఇప్పటివరకు అన్ని జట్లు తమ తొలి రెండు మ్యాచ్‌లు ఆడగా, ఇంగ్లాండ్ మరియు భారతదేశం మాత్రమే రెండు విజయాలు సాధించి సెమీ-ఫైనల్ రేసులో ముందంజలో ఉన్నాయి. మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా ఇంగ్లాండ్ అగ్రస్థానంలో ఉంది.మరోవైపు పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు ఇంకా విజయం సాధించకపోవడంతో టోర్నీలో తమ అవకాశాలు ప్రమాదంలోకి వెళ్లాయి.
Read also:Mobile Congress : ఒక జీబీ వైర్‌లెస్ డేటా కప్పు టీ ధర కంటే తక్కువ.. ప్రధాని మోదీ
ప్రస్తుత పాయింట్స్ టేబుల్ (Women’s World Cup 2025)
| జట్టు | మ్యాచ్‌లు | పాయింట్లు | నెట్ రన్ రేట్ |
|---|---|---|---|
| ఇంగ్లాండ్ | 2 | 4 | +1.757 |
| భారతదేశం | 2 | 4 | +1.515 |
| ఆస్ట్రేలియా | 2 | 3 | +1.780 |
| బంగ్లాదేశ్ | 2 | 2 | +0.573 |
| దక్షిణాఫ్రికా | 2 | 2 | -1.402 |
| శ్రీలంక | 2 | 1 | -1.255 |
| న్యూజిలాండ్ | 2 | 0 | -1.485 |
| పాకిస్తాన్ | 2 | 0 | -1.777 |
టోర్నమెంట్ షెడ్యూల్ & భారత జట్టు ఆశలు
ఈ టోర్నమెంట్(Women cricket Tournament) సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు జరుగుతుంది. భారత మహిళల(WomenCricekt2025) జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ప్రపంచ కప్ గెలవకపోయినా, రెండు సార్లు (2005, 2017) ఫైనల్ వరకు చేరింది. ఈసారి మొదటి రెండు విజయాలతో మంచి ప్రారంభం ఇచ్చి ట్రోఫీ ఆశలను బలపరిచింది.
మహిళల ప్రపంచ కప్ 2025లో అగ్రస్థానంలో ఎవరు ఉన్నారు?
ఇంగ్లాండ్ ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది.
భారత్ ఎక్కడ ఉంది?
భారత్ రెండవ స్థానంలో ఉంది, రెండు విజయాలతో 4 పాయింట్లు సాధించింది.
ఈ టోర్నమెంట్ ఎప్పటి వరకు జరుగుతుంది?
నవంబర్ 2, 2025 వరకు.
Read hindi news: hindi.vaartha.com
EPaper: https://epaper.vaartha.com/
Read Also: