పార్లమెంట్ (Parliament) శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. సోమవారం మొదలై డిసెంబర్ 19 వరకు 15 సిట్టింగుల్లో జరిగే సమావేశాలు వాడి వేడిగా జరగనున్నాయి.15 సిట్టింగుల్లో పార్లమెంటు సమావేశాలు నిర్వహించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
Read Also: Gold Price Today : వారం రోజుల్లో రూ.3,980 పెరిగిన బంగారం ధరలు.. తాజా రేట్లు ఇవే…
సభ సజావుగా సాగేందుకు సహకరించాలి
ప్రభుత్వం పార్లమెంట్ (Parliament) ను నియంత్రించాలని చూస్తోందంటూ కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అఖిలపక్ష సమావేశంలో తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓటర్ల జాబితాల భద్రత, ఢిల్లీ పేలుడు, విదేశాంగ విధానాలు, ఆర్థిక పర్యావరణ భద్రత వంటి కీలక అంశాలపై చర్చకు ఈ సమావేశంలో ప్రతిపక్షాలు.. డిమాండ్ చేశాయి. మరోవైపు సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాల సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం కోరింది.
ఈ సమావేశాల్లో 14 బిల్లులను ప్రవేశపెట్టేందుకు నరేంద్ర మోదీ సర్కార్ సిద్ధం అవుతోంది. వీటిలో అణుశక్తి రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచే అణుశక్తి బిల్లు 2025, ఉన్నత విద్యలో పర్యవేక్షణ కోసం ఉన్నత విద్యా కమిషన్ ఆఫ్ ఇండియా బిల్లు 2025 వంటి కీలక బిల్లులు ఉన్నాయి. ఈ స్వల్పకాలిక సమావేశాలు.. శాసనపరమైన ఆశయాలు, రాజకీయ ఘర్షణల మధ్య ఉత్కంఠగా సాగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ సెషన్‌లో ప్రవేశపెట్టబోయే ప్రధానమైన బిల్లు
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్,పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో జరిగే సమావేశంలో అన్ని పార్టీల పార్లమెంటరీ పక్ష నేతలు పాల్గొన్నారు. బిల్లుల ఎజెండాను అన్ని పక్షాలకు అందజేయడమే కాకుండా సభ సజావుగా సాగేందుకు సహకరించాలని,కీలక బిల్లులపై జరిగే చర్చల్లో పాల్గొనాలని బిల్లుల ఆమోదానికి సహకరించాలని కేంద్రం విపక్షాలను కోరింది. ఇక పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై సోనియా నివాసంలో కాంగ్రెస్ నేతల కీలక సమావేశం జరగనుంది.
ప్రతిపక్షాల నుంచి ఎంత ప్రతిఘటన ఎదురైనా.. ఈ స్వల్పకాల సమావేశాల్లోనే పలు కీలక బిల్లులను ఆమోదింపజేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సెషన్‌లో ప్రవేశపెట్టబోయే ప్రధానమైన బిల్లులను కూడా ఇప్పటికే తెలిపింది.అణుశక్తి వినియోగాన్ని నియంత్రిస్తూనే.. అణు రంగంలో ప్రైవేట్ రంగానికి భాగస్వామ్యం కల్పించడం దీని లక్ష్యం.
దేశంలోని యూనివర్సిటీలకు స్వయంప్రతిపత్తిని ప్రోత్సహించడం.. పారదర్శక గుర్తింపు విధానాలు, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి బలమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయడం దీని ఉద్దేశం.జన విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు.. దివాలా, బ్యాంక్రప్టసీ కోడ్ (సవరణ) బిల్లు.. కార్పొరేట్ చట్టాల (సవరణ) బిల్లు.. బీమా చట్టాల (సవరణ) బిల్లు, జాతీయ రహదారుల (సవరణ) బిల్లు వంటివి కూడా కేంద్ర ప్రభుత్వ అజెండాలో ఉన్నాయి.
ఈ సారి పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం జాబితా చేసిన బిల్లుల ఇవే
- జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు 2025
- ది ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ వోడ్ (సవరణ) బిల్లు 2025
- భీమా చట్టాలు (సవరణ) బిల్లు 2025
- మణిపూర్ వస్తు సేవల పన్ను (సవరణ) బిల్లు, 2025
- జాతీయ రహదారులు (సవరణ) బిల్లు, 2025
- ది అణుశక్తి బిల్లు, 2025
- కార్పొరేట్ చట్టాలు (సవరణ) బిల్లు, 2025
- సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లు (SMC), 2025
- ది ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ (సవరణ) బిల్లు, 2025
- భారత ఉన్నత విద్యా కమిషన్ బిల్లు 2025
- రాజ్యాంగం (131వ సవరణ) బిల్లు 2025
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: