📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Petrol Prices updates : పెట్రోల్ ధరలు పెరుగుతాయా?

Author Icon By Sudheer
Updated: March 21, 2026 • 10:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Petrol Prices updates : పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు సుమారు 108-119 డాలర్ల వరకు పెరిగాయి. దీని ప్రభావంతో ఇప్పటికే దేశంలో ప్రీమియం పెట్రోల్ (Power/XP95) ధర లీటరుకు రూ. 2 వరకు, అలాగే పరిశ్రమలకు విక్రయించే ఇండస్ట్రియల్ డీజిల్ ధర ఏకంగా రూ.22 వరకు పెరిగింది. వీటితో పాటు మార్చి 7 నుండి గృహ అవసరాల LPG సిలిండర్ ధర కూడా రూ.60 పెరిగిన విషయం తెలిసిందే. అయితే, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) మరియు ప్రభుత్వం ప్రస్తుతానికి సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉంచాయి. సామాన్యుడిపై నేరుగా భారం పడకుండా ఆయిల్ కంపెనీలే ఈ నష్టాన్ని భరిస్తున్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Read Also : Petrol : పెట్రోల్, డీజిల్ ధరలపై IOCL కీలక ప్రకటన

ప్రస్తుతానికి సాధారణ ఇంధన ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, ఇది తాత్కాలికమేనని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల తర్వాత ధరల పెంపు తప్పకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు(Petrol Prices updates) బ్యారెల్‌కు 110 డాలర్లు దాటితే, ఆయిల్ కంపెనీలు తమ నష్టాలను పూడ్చుకోవడానికి సాధారణ పెట్రోల్‌పై Rs.10-15, డీజిల్‌పై Rs.10 వరకు పెంచే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ (Strait of Hormuz) వంటి కీలక సరఫరా మార్గాల్లో అడ్డంకులు ఏర్పడటం వల్ల సరఫరా కొరత ఏర్పడి, మున్ముందు సామాన్యుల జేబుకు చిల్లు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

petrol petrol price Petrol Price Hike Petrol Prices updates war effect

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.