📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్

Budget 2026: కుదేలవుతున్న వ్యవసాయ రంగాన్ని బడ్జెట్ ఆదుకునేనా?

Author Icon By Vanipushpa
Updated: January 20, 2026 • 5:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రైతులకు మంచి శుభవార్త తీసుకొచ్చేలా కేంద్ర బడ్జెట్-2026 (Budget-2026) రూపుదిద్దుకుంటోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాతావరణ మార్పులు, అకాల వర్షాలు, ఎండల తీవ్రత, ధరల ఊగిసలాటతో కుదేలవుతున్న వ్యవసాయ రంగాన్ని ఇకపై కేవలం జీవనాధారంగా కాకుండా లాభసాటి, సుస్థిర వ్యాపారంగా మార్చే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేయనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈసారి బడ్జెట్‌లో సంప్రదాయ సాగు పద్ధతులకు గుడ్‌బై చెప్పి, సాంకేతికత ఆధారిత ‘స్మార్ట్ అగ్రికల్చర్’ వైపు దూకుడు కనిపించనుంది. తాత్కాలిక సబ్సిడీలకే పరిమితం కాకుండా… రైతు ఆదాయం పెరిగేలా, ఉత్పాదకత మెరుగుపడేలా, మార్కెట్‌కు నేరుగా అనుసంధానం అయ్యేలా దీర్ఘకాలిక విధానాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. రైతు సంక్షేమం ఇప్పుడు ప్రభుత్వ ఆర్థిక వ్యూహంలో కేంద్ర బిందువుగా మారుతోందని ఇది స్పష్టం చేస్తోంది.

Read Also: Phone Tapping Case : సిట్ విచారణకు హాజరు అవుతున్న హరీష్ రావు

Budget 2026: కుదేలవుతున్న వ్యవసాయ రంగాన్ని బడ్జెట్ ఆదుకునేనా?

బడ్జెట్‌లో చోటు దక్కే అవకాశం

భారీగా కేటాయింపులు.. గత పదేళ్లలో వ్యవసాయానికి కేటాయింపులు భారీగా పెరగడం కూడా ఇదే దిశను సూచిస్తోంది. 2013-14లో కేవలం రూ. 21,933 కోట్లుగా ఉన్న వ్యవసాయ బడ్జెట్… ఇప్పుడు రూ. 1.27 లక్షల కోట్లకు పైగా చేరడం గమనార్హం. ఈ పెరుగుదల రైతులపై పెట్టుబడిని ప్రభుత్వానికి ఎంత ప్రాధాన్యమో చెబుతోంది. క్లైమేట్-రెసిలియంట్.. కరువు, వరదలను తట్టుకునే ఆధునిక విత్తనాల అభివృద్ధికి అదనపు నిధులు, డ్రిప్ ఇరిగేషన్, సూక్ష్మ సేద్యం వంటి నీటి సంరక్షణ పద్ధతులకు మరింత ప్రోత్సాహం, సేంద్రియ సాగు ద్వారా భూసారాన్ని కాపాడే విధానాలు బడ్జెట్‌లో చోటు దక్కే అవకాశముంది. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గిస్తూ రైతును రక్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు ఉండనున్నాయి.

PPP మోడల్‌ను మరింత బలోపేతం

PPP మోడల్‌ రైతుల నష్టాలకు ప్రధాన కారణంగా మారుతున్న మౌలిక సదుపాయాల లోపాన్ని తీర్చేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కోల్డ్ స్టోరేజ్‌లు, గిడ్డంగులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేలా PPP మోడల్‌ను మరింత బలోపేతం చేయనున్నారు. పంట కోత తర్వాత నష్టం తగ్గి, రైతుకు గిట్టుబాటు ధర దక్కేలా రవాణా నెట్‌వర్క్‌ల ఆధునీకరణ కూడా బడ్జెట్‌లో కీలక అంశంగా ఉండనుంది. ఇకపై వరి, గోధుమలకే పరిమితం కాకుండా హార్టికల్చర్, ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాలు వంటి అధిక లాభాల పంటల వైపు రైతులను ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ ఆలోచన. తక్కువ నీటితో ఎక్కువ ఆదాయం ఇచ్చే పంటలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, ఎగుమతి ఆధారిత వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమాలు కూడా బడ్జెట్‌లో కనిపించే అవకాశముంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

agricultural reforms Agriculture sector Budget Analysis economic policy farm crisis farmer welfare Indian Budget rural economy Telugu News online Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.