📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Murder: మత్తుకు బానిసగా మారిన భర్తను చంపేసిన భార్య

Author Icon By Vanipushpa
Updated: May 24, 2025 • 5:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహారాష్ట్ర(Maharashtra)లోని యవత్మాల్ (Yavatmal)నగరం సమీపంలోని చౌసాలా(chosala) అటవీ ప్రాంతంలో కాలిపోయిన మృతదేహాన్ని మే 15న గుర్తించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, ఇది హత్య కేసుగా తేలింది. ఈ హత్యకు సంబంధించి ఒకదాని తర్వాత ఒకటి విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్కూల్ ప్రిన్సిపాల్‌(School Principal)గా పనిచేసే భార్య, తన ఇద్దరు విద్యార్థుల సాయంతో భర్తకు విషమిచ్చి చంపేసినట్లు తెలిసింది. తరువాత శవాన్ని అటవీప్రాంతానికి తీసుకువెళ్లి తగలబెట్టినట్టు పోలీసులు చెప్పారు. ఆ మృతదేహం 32 ఏళ్ల శంతన్ దేశ్‌ముఖ్‌(Santhan Deshmukh)ది. నిందితురాలు ఆయన భార్య నిధి దేశ్‌ముఖ్ అని పోలీసులు తెలిపారు.
నిధి దేశ్‌ముఖ్‌పై పోలీసులు హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. మూడు రోజులు ఆమెను పోలీసు కస్టడీకి పంపించారు.

Murder: మత్తుకు బానిసగా మారిన భర్తను చంపేసిన భార్య

కేసు పూర్తి వివరాలు
ఏడాది కిందట శంతన్, నిధి ప్రేమ వివాహం చేసుకున్నారు. శంతన్ తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అప్పటికే శంతన్ డ్రగ్స్‌కు బానిసయ్యారు. పెళ్లి అయిన కొన్ని నెలల్లోనే, శంతన్ భార్యను వేధించడం మొదలు పెట్టారు. శంతన్ మద్యానికి బానిస అవ్వడంతో రోజూ గొడవలు జరిగేవి. దీంతో విసిగిపోయిన నిధి, ఆయన్ని హతమార్చాలనే తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు.
హత్య ఎలా చేశారు?
ఇంటర్నెట్‌లో విషపూరిత పూల గురించి నిధి సమాచారాన్ని సేకరించినట్లు పోలీసులు తెలిపారు.పువ్వులను వీలైనన్ని సేకరించి, వాటితో రసాన్ని తయారు చేసి మద్యం మత్తులో ఉన్న తన భర్తకు ఇచ్చారు. మే 13 మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో శంతన్ మరణించారు. ట్యూషన్‌కు వచ్చిన ఇద్దరు విద్యార్థులకు నిధి విషయమంతా వివరించి, వారి సాయం కోరినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

Read Also: Gaza: గాజాలో 19 వేల మంది చిన్నారులను చంపేశారు..ఇజ్రాయెల్ ఎంపీ

drug-addicted How was the wife husband caught? who killed her

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.