గాలిపటాలు ఎగురవేసేటప్పుడు చైనా మాంజా (Manja) అస్సలు ఉపయోగించొద్దంటూ పదపదే ప్రభుత్వ అధికారులు సూచిస్తుంటారు. అంతేకాకుండా చైనా మాంజా విక్రయాలపై ప్రభుత్వం నిషేధం కూడా విధించింది. అయినప్పటికీ.. చైనా మాంజా (Manja)మార్కెట్‌లల్లో ఇంకా విచ్చలవిడిగా లభిస్తూనే ఉంది. మాంజా కారణంగా ఎన్నో ప్రాణాలు గాల్లో కలిశాయి.
Read Also: Corporate companies: కొత్త ఏడాదిలో ఆఫీస్ కు వెళ్లడం తప్పదా?
మాంజా ప్రమాదాల వెనుక కారణాలు
పతంగుల పోటీల్లో ప్రత్యర్థి పతంగి దారాన్ని కట్ చేయడానికి ఉపయోగించే చైనా మాంజాను, సాధారణ దారానికి భిన్నంగా నైలాన్ లేదా సింథటిక్ దారంతో తయారు చేస్తారు. దీనికి గాజు పొడి లేదా మెటల్ కోటింగ్ ఉంటుంది. ఇది తెగదు, సరిగ్గా మెడకు తగిలితే కత్తిలా కోసివేస్తుంది. ఈ దారం చెట్లపై, వైర్లపై చిక్కుకుని ఉండటం వల్ల పక్షుల రెక్కలు తెగి చనిపోతున్నాయి.
మెటల్ కోటింగ్ ఉండటం వల్ల కరెంటు తీగలకు తగిలినప్పుడు విద్యుత్ షాక్ తగిలే ప్రమాదం కూడా ఉంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, తెలంగాణ ప్రభుత్వం నైలాన్ మాంజా వాడకాన్ని, విక్రయించడాన్ని పూర్తిగా నిషేధించాయి. అయినా దొంగచాటుగా కొంతమంది ఈ దారాన్ని విక్రయిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: