📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Latest Telugu news : Wholesale inflation : స్వల్పంగా తగ్గిన టోకు ద్రవ్యోల్బణం..

Author Icon By Sudha
Updated: October 14, 2025 • 4:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సెప్టెంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గింది. టోకు ధరల సూచిక (WPI) 0.13 శాతానికి తగ్గిందని మంగళవారం కేంద్రం విడుదల చేసిన డేటా పేర్కొంది. ఆగస్టులో టోకు ధరల సూచి ద్రవ్యోల్బణం (Wholesale inflation)0.52 శాతంగా ఉండగా.. గత ఏడాది ఇదే సమయంలో 1.91 శాతంగా ఉందని నివేదిక చెప్పింది. టోకు ద్రవ్యోల్బణంలో సానుకూల ధోరణికి ఆహార ఉత్పత్తులు, ఆహారేతర వస్తువులు, రవాణా, దుస్తుల తయారీ ధరలు పెరగడమే కారణమని పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. టోకు ధరల సూచిక డేటా ప్రకారం.. ఆగస్టులో ఆహార ధరలు 3.06 శాతంతో పోలిస్తే సెప్టెంబర్‌లో 5.22 శాతం తగ్గాయి. అదే కాలంలో కూరగాయల ధరలు కూడా తగ్గాయి. ఆగస్టులో 14.18 శాతంతో పోలిస్తే.. సెప్టెంబర్‌లో కూరగాయల ధరలు 24.41 శాతం చేరాయి. ఆగస్టులో 2.55 శాతంతో పోలిస్తే తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం (Wholesale inflation)2.33 శాతానికి తగ్గింది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ట్రాక్ చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ నెల ప్రారంభంలో తన బెంచ్‌మార్క్ పాలసీ రేట్లను 5.5 శాతం వద్ద మార్చలేదు. సోమవారం విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం, సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల కనిష్ట స్థాయి 1.5 శాతానికి పడిపోయింది.

Wholesale inflation : స్వల్పంగా తగ్గిన టోకు ద్రవ్యోల్బణం..

ఇండెక్స్ డేటా ప్రకారం

ఆహార ఉత్పత్తులు, ఆహారేతర వస్తువులు, రవాణా పరికరాలు, దుస్తుల తయారీ ధరల పెరుగుదల కారణంగా సెప్టెంబర్ 2025 లో టోకు ద్రవ్యోల్బణంలో సానుకూల ధోరణి ఉందని పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్ డేటా ప్రకారం.. ఆగస్టులో 3.06 శాతంతో పోలిస్తే.. సెప్టెంబర్‌లో ఆహార ధరలు 5.22 శాతం తగ్గాయి. కూరగాయల ధరలు కూడా ఇదే కాలంలో తగ్గాయి. కూరగాయల ధరలు ఆగస్టులో 14.18 శాతంతో పోలిస్తే.. సెప్టెంబర్ లో 24.41 శాతం తగ్గాయి. తయారైన ఉత్పత్తుల ద్రవ్యోల్బణం ఆగస్టులో 2.55 శాతంతో పోలిస్తే.. 2.33 శాతానికి తగ్గింది. ఇంధనం, విద్యుత్ రంగాల్లో ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 2.58 శాతంగా నమోదైంది. ఇది అంతకుముందు నెలలో ఇది 3.17 శాతంగా ఉన్నది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన బెంచ్‌మార్క్‌ పాలసీ రేట్లను ఈ నెల ప్రారంభంలో 5.5 శాతం వద్దే యథావిధిగా కొనసాగించింది. రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో ఎనిమిదేళ్ల కనిష్ట స్థాయి 1.5 శాతానికి పడిపోయిందని సోమవారం విడుదల చేసిన అధికారిక గణాంకాలు వెల్లడించాయి.

ధరలు అదుపులో ..

రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో గణనీయంగా తగ్గి 1.54 శాతానికి చేరుకుంది. గడిచిన ఎనిమిదేళ్లలో ఇదే కనిష్టం. అంతకుముందు నెలలో ఇది 2.07 శాతంగా నమోదైంది. కూరగాయలు, పప్పులతో పాటు ఇతర ఆహార పదార్థాల ధరలు అదుపులో ఉండడం ద్రవ్యోల్బణం తగ్గడానికి ప్రధాన కారణమని ఎన్ఎస్ఓ పేర్కొంది. 2024 సెప్టెంబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏకంగా 5.49 శాతంగా ఉన్నది. ఆహార ద్రవ్యోల్బణం ఆగస్టులో –2.28 శాతంగా నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరం మరుసటి ఆరు నెలల ద్రవ్యోల్బణం అంచనాలను ఆర్‌బీఐ తగ్గించిన విషయం తెలిసిందే. నైరుతి రుతుపవనాలు, ఖరీఫ్‌లో అధిక సాగు, రిజర్వాయర్లలో భారీగా నీరు ఉండడం, ధాన్యాల బఫర్ స్టాక్ కారణంగా ఆహార ఉత్పత్తులు అదుపులోనే ఉంటాయని అంచనా వేసింది.

ఉదాహరణతో తెలుగులో ద్రవ్యోల్బణం అర్థం?

ఆహారం, దుస్తులు వంటి వివిధ రకాల ఉత్పత్తులు, సేవలు, కిరాయిలు, రవాణా ఖర్చులు మొదలైన వాటి ధరల పెరుగుదల రేటును ద్రవ్యోల్బణంగా నిర్వహిస్తారు . కొన్నాళ్ల క్రితం రూపాయికే వచ్చిన వస్తువును నేడు పది రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుండటం.. ద్రవ్యోల్బణానికి నిదర్శనం.

ద్రవ్యోల్బణం అంటే ఏమిటి మరియు దాని రకాలు ఏమిటి?

ద్రవ్యోల్బణం వస్తువులు మరియు సేవల ధరలు ఎంత త్వరగా పెరుగుతున్నాయో కొలుస్తుంది. ద్రవ్యోల్బణాన్ని మూడు రకాలుగా వర్గీకరించారు. డిమాండ్-పుల్ ద్రవ్యోల్బణం, వ్యయ-పుష్ ద్రవ్యోల్బణం మరియు అంతర్నిర్మిత ద్రవ్యోల్బణం . సాధారణంగా ఉపయోగించే ద్రవ్యోల్బణ సూచికలు వినియోగదారు ధరల సూచిక మరియు టోకు ధరల సూచిక.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

BreakingNews Economic News India economy Inflation Rate latest news Price Index Telugu News Wholesale Inflation WPI

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.