📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

ఢిల్లీ సీఎం ఎవరు?.. వినిపిస్తున్న పేర్లు ఇవే..?

Author Icon By sumalatha chinthakayala
Updated: February 8, 2025 • 11:53 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఢిల్లీ బీజేపీ విజయం దిశగా దూసుకెళ్లింది. భారీ మెజార్టీతో ఇప్పటికే మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు? అనే చర్చ నడుస్తోంది. బీజేపీ నుంచి ముఖ్యంగా కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో మోడీ మార్క్‌ రాజకీయాల్లో భాగంగా మహిళకు అవకాశం ఇస్తారా? అనే విషయం తెరపైకి వచ్చింది.

ఈ క్రమంలోనే ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా ప్రస్తుతం వీరేంద్ర సచ్‌దేవా కొనసాగుతున్నారు. ఆయన సీఎం రేసులో ముందు వరుసలో ఉన్నా రు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ సీఎం పోస్టుపై అగ్రనాయకత్వం నిర్ణయమే ఫైనల్. అది మాకు పెద్ద సమస్య కాదు. ఆప్‌ను ఓడించడమే మా లక్ష్యం అంటూ కామెంట్స్‌ చేశారు. అయితే, హర్యానా, మహారాష్ట్రలో బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రిని ఖరారు చేసింది. పార్టీ సమావేశం.. ఆ తరువాతనే సీఎంను ప్రకటించింది. ఇప్పుడు కూడా అదే తరహాలో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

మరోవైపు.. మహిళా సీఎం ఉంటారనే వాదన అనూహ్యంగా తెర మీదకు రావటంతో కొత్త సమీకరణాలపైన చర్చ జరుగుతోంది. 1993లో ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన సమయంలో సుష్మా స్వరాజ్ కేంద్ర మంత్రిగా రాజీనామా చేసి ఢిల్లీ సీఎంగా బాధ్యతలు అప్పగించారు. మరోసారి మహిళకే సీఎం పగ్గాలు ఇవ్వాలని నిర్ణయిస్తే రేసులో స్మృతి ఇరానీ, మీనాక్షి లేఖి, బన్సూరి స్వరాజ్ పేర్లను బీజేపీ అధిష్టానం పరిశీలించే అవకాశం ఉంది. అదే సమయంలో ఎంపీ మనోజ్ తివారీ, పర్వేశ్ వర్మ, రమేశ్ బిధూరి కూడా సీఎం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మనోజ్ తివారీ, వీరేంద్ర సచ్‌దేవా, పర్వేశ్ వర్మలలో ఒకరిని సీఎంగా, మిగతా ఇద్దరినీ డిప్యూటీ సీఎంలుగా ఎంపిక చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా ఎన్నికల ప్రచారంలోనూ మహిళా ఓటర్లే లక్ష్యంగా హామీలు గుప్పించిన విషయం తెలిసిందే.

BJP CM Candidate Delhi Elections Delhi Results Google news Veerendra Sachdeva

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.