కేంద్ర ఎన్నికల సంఘంపై పశ్చిమ్ బెంగాల్(West Bengal) ఎమ్మెల్యే, తృణమూల్ కాంగ్రెస్ (Congress) నేత మొనీరుల్ ఇస్లాం తీవ్రమైన బెదిరింపులకు పాల్పడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై తృణమూల్, ఈసీ మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల సంఘం అధికారులను కర్రలతో కొట్టి నడుము విరగ్గొడతామని ఇస్లాం హెచ్చరించారు. ఈసీ అధికారులకు చట్టపరమైన రక్షణ కల్పించే వివాదాస్పద చట్టాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
Read Also: Budget 2026: ఉద్రిక్తతల మధ్య బడ్జెట్ ఎలా ఉంటుంది?
మొనీరుల్ ఇస్లాం 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఫరాక్కా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి మాట్లాడిన ఎమ్మెల్యే.. ‘సమాధిలోంచి లాగి బయటకు తీస్తాం’ అని అసభ్య పదజాలంతో విమర్శించారు. బెంగాల్ ప్రజలను హింసిస్తూ, బీజేపీని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘం చర్యలు బీజేపీ గెలుపు కోసమేనని ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఈసీ, బీజేపీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
‘వాళ్లను (ఈసీ) కర్రలతోనే విరగ్గొట్టాలి. (West Bengal) ఎన్నికల సంఘం నడుము విరగ్గొట్టడానికి మాకు కర్రలు కావాలి. మీరు ప్రజలతో ఆడుకుంటున్నారు కానీ రక్షణ కవచంలో కూర్చున్నారు’ అని ఇస్లాం ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు కలుగులో ఉన్నారు కానీ మేము మిమ్మల్ని (కుమార్‌ను ఉద్దేశించి) బయటకు లాగుతాం భూమిలోంచి లాగి తెస్తాను’ అని అన్నారు.
ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ తృణమూల్, బీజేపీ, ఈసీ మధ్య పెద్ద వివాదంగా మారింది. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుంది. SIR (Special Intensive Revision) అనేది లక్షలాది మంది అర్హత గల ఓటర్లను ముఖ్యంగా తృణమూల్ మద్దతుదారులను తొలగించే కుట్ర అని టీఎంసీ ఆరోపిస్తోంది. అయితే, రాజ్యాంగం ప్రకారం SIR ప్రక్రియ తమ విధిలో భాగమని ఎన్నికల సంఘం చెబుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: