Amit shah news : పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో లాభం కోసం చొరబాటుదారులకు ఆశ్రయం కల్పిస్తూ రాష్ట్ర భద్రతను ప్రమాదంలోకి నెట్టేస్తోందని ఆరోపించారు. అవినీతి, అక్రమ వలసలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆయన మండిపడ్డారు.
West Bengal ఉత్తర 24 పరగణాల జిల్లా బ్యారక్‌పూర్‌లో జరిగిన బీజేపీ సభలో మాట్లాడుతూ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో Bharatiya Janata Party అధికారంలోకి వస్తే కేవలం 45 రోజుల్లోనే రాష్ట్ర సరిహద్దుల వద్ద పూర్తి స్థాయి కంచె ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సరిహద్దు భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు.
Arava Sreedhar : జనసేన MLA శ్రీధర్ పై NHRCకి వీణ ఫిర్యాదు
కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ Mamata Banerjee ప్రభుత్వం Border Security Force కు భూమి కేటాయించడం లేదని ఆరోపించారు. చొరబాటుదారులను ఓటు బ్యాంక్‌గా మార్చుకుంటోందని, నకిలీ పత్రాలతో దేశమంతా తిరుగుతున్నారని అన్నారు. దేశ భద్రత కోసం బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం అవసరమని షా స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: