📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

Weight Loss: బెంగళూరు ట్రాఫిక్ కారణంగా 8 కేజీలు తగ్గిన టెకీ!

Author Icon By Saritha
Updated: January 24, 2026 • 11:16 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉండే నగరాల్లో బెంగళూరు (Bengaluru) ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచింది. ట్రాఫీక్ రద్దీతో ప్రయాణికులకు నరకం చూపించే ఈ సిటీ ఓ వ్యక్తికి మాత్రం చాలా మంచి చేసింది. బెంగళూరు ట్రాఫిక్ అతడి జీవితాన్ని ఊహించని రీతిలో మార్చింది. (Weight Loss) ట్రాఫిక్ పుణ్యమా అని అతడు 8 కేజీల బరువు తగ్గాడు. అతడు ఆఫీసుకు వెళ్లడం కోసం ప్రతి రోజు బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ నుంచి కొరమంగళకు ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఆఫీసుకు చేరుకోవడానికి గాను అతడికి దాదాపు 90 నిమిషాలు పట్టేది. దీనివల్ల అతడు తీవ్ర ఒత్తిడికి గురయ్యేవాడు. ఆఫీసులో ఎక్కువ సమయం కూర్చోవడం, ఇంటికి వెళ్ళాక అలసిపోవడం వల్ల వ్యాయామం చేయడానికి సమయం దొరికేది కాదు.

Read Also: Shashi Tharoor: త్వరలో బీజేపీలోకి శశిథరూర్?

ట్రాఫిక్ మారలేదు.. నేను మారాను

దీని గురించి అతడు చెబుతూ.. ‘ఈ జర్నీ వల్ల నేను తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొనేవాడిని.. తినడానికి కూడా సమయం దొరికేది కాదు. (Weight Loss) ఆఫీసుకు వెళ్లాక ఆదరాబాదరా నా డెస్క్ దగ్గరే తినేవాడిని. ఇంతసేపు ప్రయాణం వల్ల నాకు వ్యాయామం చేసే ఓపిక, సమయం ఉండేవి కావు’ అన్నాడు. ఈ ట్రాఫిక్ నరకం నుంచి తప్పించుకోవడానికి నేను కొన్ని మార్పులు చేసుకున్నాను. వారంలో మూడు రోజులు ఇంటి నుంచే పని చేయడం మొదలుపెట్టాను. ఉదయాన్నే తన ఇంటి దగ్గర ఉన్న జిమ్‌కు వెళ్లేవాడిని.

అలాగే, బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేయడం మానేసి, దగ్గర్లోని రెస్టారెంట్లకు నడిచి వెళ్లేవాడిని’ అని చెప్పుకొచ్చాడు. బెంగళూరు ట్రాఫిక్ మారలేదు, కానీ సదరు టెకీ జీవనశైలి మారింది. ఈ మార్పుల వల్ల అతడి ఆరోగ్యం మెరుగుపడింది. అతడి రెస్టింగ్ హార్ట్ రేట్ (గుండె కొట్టుకునే వేగం విశ్రాంతిగా ఉన్నప్పుడు) 82 నుంచి 64కు తగ్గిందట. అంతేకాదు, పెద్దగా ప్రయత్నించకుండానే దాదాపు 8 కిలోలు బరువు తగ్గానని చెప్పుకొచ్చారు. ఆయన మాటల్లో చెప్పాలంటే.. ‘ట్రాఫిక్ మెరుగుపడలేదు. అందుకే నేను దానితో పోరాడటం మానేశాను.. ఫలితంగా నా జీవితం మారింది’ అని చెప్పుకొచ్చాడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చాలా మంది దృష్టిని ఆకర్షించింది. 

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:


Bangalore Traffic Bengaluru Techie Bengaluru Traffic Jam IT Employee Life Latest News in Telugu Telugu News weight loss Weight Loss Story World Traffic Rankings

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.