తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత(Weather) రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణలో పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోవడంతో ప్రజలు వణుకుతున్నారు. హైదరాబాద్ నగరాన్ని కోల్డ్ వేవ్స్ ప్రభావితం చేస్తుండగా, చలిగాలుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలోని కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ(Meteorological Department) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని మన్యం జిల్లా ప్రాంతాల్లో చలి మరింత ఉగ్రరూపం దాల్చింది. అక్కడ నీళ్లు గడ్డకట్టే స్థాయిలో చలిగాలులు వీచుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు చలి తీవ్రత కొనసాగవచ్చని హెచ్చరిస్తోంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Read also: Youth Trend: ‘దక్కన్ మైగ్రేషన్’: హైదరాబాద్‌లో యువత కొత్త ట్రెండ్..
రానున్న మూడు రోజుల వాతావరణ సూచనలు
అమరావతి(Weather) వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫియర్‌లో ఈశాన్య, తూర్పు దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో సోమవారం, మంగళవారం పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. బుధవారం కూడా ఎక్కువ ప్రాంతాల్లో పొడి వాతావరణమే కొనసాగనుంది.
రాయలసీమ ప్రాంతాల్లో సోమవారం పొడి వాతావరణం ఉంటుందని, కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం, బుధవారం ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు సాధారణంగా పొడి వాతావరణమే కొనసాగనుంది. అయితే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: