📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Caste Census : కేంద్ర కాంగ్రెస్ కులగణనకు మీము సపోర్ట్ ఇస్తాం – రాహుల్

Author Icon By Sudheer
Updated: April 30, 2025 • 9:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ దార్శనికతకు చెందిన ఆలోచనేనని, కేంద్రం ఇప్పుడది అమలు దిశగా అడుగులు వేయడం స్వాగతార్హమని పేర్కొన్నారు. కులగణన వల్ల సమానత్వాన్ని సాధించేందుకు మార్గం సుగమమవుతుందని, ఇది దేశానికి అవసరమైన సమాజ మార్పుకు కీలకపదంగా నిలుస్తుందన్నారు.

కులగణనను నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి

రాహుల్ గాంధీ మాట్లాడుతూ, కులగణనను నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తిచేయాలని కేంద్రం స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని డిమాండ్ చేశారు. కుల గణనకు అనుకూల వాతావరణం, పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం అవసరమని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రక్రియలో భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్రం చేపట్టే కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతుగా నిలబడుతుందని ఆయన చెప్పారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే ఉదాహరణ

తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేను ఉదాహరణగా ప్రస్తావించిన రాహుల్, అది దేశవ్యాప్తంగా చేపట్టే గణనకు ఒక నమూనా అని అభివర్ణించారు. కులగణన ద్వారా సమాజంలోని వాస్తవ స్థితిగతులు వెల్లడి అవుతాయని, దాని ఆధారంగా ప్రభుత్వ విధానాలు రూపొందించవచ్చని వివరించారు. “సామాజిక న్యాయం కోసం ఇది ఒక నూతన అభివృద్ధి నమూనా. కేంద్రం దీనిని స్వీకరించడం సానుకూల పరిణామం” అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

Read Also : Caste Census : కాంగ్రెస్ కులగణనకు వ్యతిరేకి – బండి సంజయ్

caste census Google News in Telugu rahul gandhi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.