📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

34 లక్షలమందికి నీళ్లు కట్.. బీజేపీ కుట్ర: ఆతిశీ

Author Icon By Vanipushpa
Updated: January 28, 2025 • 3:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఢిల్లీ ఎన్నికల సంగ్రామం దగ్గరపడుతోంది. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు మూడు పార్టీలు పోటీపడి మరీ హామీలు ఇస్తున్నాయి. ఢిల్లీ ఎన్నికల సమీపిస్తున్న క్రమంలో ఢిల్లీ సీఎం ఆతిశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి సరఫరా అవుతున్న తాగునీటిని కలుషితం చేసి ఆ నెపాన్ని ఆమ్ ఆద్మీ పార్టీపై వేసి ఎన్నికల్లో లాభపడాలని బీజేపీ కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. హరియాణాలోని బీజేపీ సర్కార్ కావాలనే ఢిల్లీకు సరఫరా అయ్యే నీటిని కలుషితం చేస్తోందని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. బీజేపీ కుట్ర వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆతిశీ తెలిపారు. ఎన్నికల సంఘం ఈ విషయంలో జోక్యం చేసుకుని.. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరారు.

34 లక్షల మందికి నీళ్లు బంద్.. హరియాణా, ఢిల్లీ గుండా యమునా నది ప్రవహిస్తుంది. ఈ నదిలో హరియాణా సర్కార్ కావాలనే రసాయనాలు, పరిశ్రమలకు చెందిన కలుషితాలు కలిపేస్తున్నారని ఆప్ సర్కార్ మండిపడుతోంది. ఢిల్లీ జల్ బోర్డు కేవలం 1 పీపీఎమ్ పరిధిలోని అమ్మోనియాను మాత్రమే శుభ్రం చేసే సామర్థ్యం ఉంది. కానీ హరియాణా ప్రభుత్వ చర్యల వల్ల దిల్లీలోని వాటర్ ప్లాంట్స్ లో అమ్మోనియం లెవెల్స్ 7 పీపీఎం కంటే అధికంగా పెరిగి తాగునీరు కలుషితం అవుతోంది.దీంతో నీటి సరఫరా 15- 20శాతం తగ్గిపోయింది. దాదాపు 34 లక్షల మంది ప్రజలు తాగినీటి కొరతను ఎదుర్కొంటున్నారు. దీన్ని చూపించి ఆప్ సర్కార్ పై అసత్య ప్రచారం చేసి ఎన్నికల్లో లాభ పడాలని బీజేపీ చూస్తోంది. ఇది ఒక వాటర్ టెర్రరిజం అని దిల్లీ సీఎం ఆతిశీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

app BJP Delhi CM Atishi Delhi Elections 2025 Water Pollution

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.