మహారాష్ట్ర రాజకీయాల్లోని ఒక ధ్రువతార నేలకొరిగింది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) ప్రయాణిస్తున్న విమానం బుధవారం ఉదయం బారామతి వద్ద కుప్పకూలడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పుడు వెలుగులోకి వస్తున్న కొన్ని చేదు నిజాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రమాదానికి గురైన విమానం యొక్క గత చరిత్ర ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘోర ప్రమాదం వెనుక ఉన్న సాంకేతిక లోపాలు, విమానయాన సంస్థ ట్రాక్ రికార్డ్ గురించిన పూర్తి వివరాలు.. గతంలోనూ ప్రమాదానికి గురైన అదే సంస్థ విమానం అజిత్ పవార్ (Ajit Pawar) మరణానికి కారణమైన ‘లియర్ జెట్ 45 XR’ (Learjet 45 XR) విమానం ‘VSR వెంచర్స్’ అనే సంస్థకు చెందింది.
Read Also: TG Politics: స్థానిక ఎన్నికల్లో BC రిజర్వేషన్లపై రాజకీయ మౌనం
అధికారుల సమాచారం ప్రకారం..
గత రెండున్నర ఏళ్లలో ఈ సంస్థకు చెందిన విమానాలు మహారాష్ట్రలో ప్రమాదానికి గురవ్వడం ఇది రెండోసారి. గతంలో సెప్టెంబర్ 14, 2023న ఇదే సంస్థకు చెందిన మరొక విమానం (VT-DBL) ముంబై విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో కుప్పకూలింది. విశాఖపట్నం నుంచి ముంబైకి ప్రయాణికులను తీసుకెళ్తున్న ఆ విమానం.. భారీ వర్షం కారణంగా రన్‌వేపై అదుపు తప్పి రెండు ముక్కలైంది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఎవరూ చనిపోలేదు. కానీ, ఈ రోజు బారామతిలో జరిగిన ప్రమాదంలో మాత్రం అజిత్ పవార్ (Ajit Pawar) సహా నలుగురు ప్రాణాలు కోల్పోవడం తీరని విషాదాన్ని నింపింది.
బారామతి రన్‌వే వద్ద ఏం జరిగింది?
ముంబై నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఉదయం 8:48 గంటల ప్రాంతంలో బారామతి రన్‌వేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా, విమానం ఒక్కసారిగా అదుపు తప్పి కిందకు పడిపోయింది. భూమిని ఢీకొన్న వెంటనే విమానం మంటల్లో చిక్కుకుంది. ఆ సమయంలో విమానంలో ఉన్న ఐదుగురు (అజిత్ పవార్, ఇద్దరు వ్యక్తిగత సిబ్బంది, ఇద్దరు పైలట్లు) అక్కడికక్కడే మృతి చెందారు. మహారాష్ట్రలో ‘దాదా’గా పిలవబడే అజిత్ పవార్ (Ajit Pawar) మరణంతో ఆ రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా స్తంభించిపోయింది. మహాయుతి ప్రభుత్వంలో కీలక చక్రం తిప్పిన ఆయన లేకపోవడం భారీ లోటుగా మారింది. ఈ ఘటనపై డీజీసీఏ (DGCA) ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. VSR వెంచర్స్ సంస్థ విమానాల నిర్వహణలో ఏవైనా లోపాలు ఉన్నాయా? పాత విమానాలను అలాగే వాడుతున్నారా? అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: