ప్రపంచ దిగ్గజ బిజినెస్ మ్యాన్ వారెన్ బఫెట్ (Warren Buffett) దాతృత్వంలో ముందుంటారు. ఇప్పటికే పలు స్వచ్ఛంద సంస్థలకు తన వంతు సాయంగా పెద్ద మొత్తం(A large amount)లో విరాళాలు అందించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ఈసారి కొన్ని రూ.వేల కోట్లను స్వచ్ఛంద సంస్థ (Charity organization)కు దానం చేశారు.వారెన్ బఫెట్ 94 వయసులో కూడా దాతృత్వంలో ముందడుగు వేసారు. 2025 జూన్ 28న ఆయన తన బెర్క్‌షైర్ హాతవే షేర్లను వైద్యం & కుటుంబ ఆధారిత ఐదు ప్రతిష్టాత్మక స్వచ్ఛంద సంస్థలకు దానం చేశారు.
ఐదో స్థానం
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ నిర్వహిస్తున్న గేట్స్ ఫౌండేషన్ (Gates Foundation)కు వారెన్ బఫెట్ భూరి విరాళం ఇచ్చారు. 6 బిలియన్ డాలర్ల విలువైన బెర్క్‌షైర్ హాత్ వే (Berkshire Hathaway) షేర్లను విరాళంగా అందించారు. వీటి మొత్తం విలువ దాదాపు రూ.50 వేల కోట్లు అని అంచనా. ఒక్క ఏడాదిలో ఇంత మొత్తం విరాళంగా ఇవ్వడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ మొత్తాన్ని గేట్స్ ఫౌండేషన్‌తోపాటు, కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ధనవంతుల జాబితాలో వారెన్ బఫెట్ 152 బిలియన్ డాలర్ల నికర విలువతో ఐదో స్థానంలో నిలిచారు. తాజా విరాళంతో ఆయన ఆరో స్థానానికి చేరుకున్నారు.
ప్రతి సంవత్సరం అతని షేర్ల విలువ 5% తగ్గుతూ వస్తున్నా, స్టాక్ విలువ పెరిగడంతో దానాలు ప్రతివేళా భారీ స్థాయిలో ఉంటాయి.ఆరోగ్యం, విద్య, పేదరిక నివారణ, పోలీసీ కార్యకలాపాలు – Gates & Buffett ఫౌండేషన్ల ద్వారా విశాల పరిధి ఉంది.వారెన్ బఫెట్ తన సమృద్ధిని మార్పుకు, న్యాయమైన దాతృత్వానికి ఉపయోగిస్తూ, సంపద షేర్ చేయడంలో ప్రపంచానికి ఒక ప్రేరణగా నిలుస్తున్నారు. Gates మరియు కుటుంబ సంస్థలలో భారీ విరాళాల పంపిణీ ద్వారా ఆరోగ్యం, విద్య, పేదరిక నిరోధం వంటి సమాజిక సందర్భాలలో అతను చేసిన మార్పు స్థిరంగా ఉంటుంది.
Read Also:Guwahati: గౌహతి వెళ్తున్నారా? ఈ టాప్ టూరిస్ట్ ప్లేసులు మిస్ అవ్వకండి!