war :’యుద్ధమంటల’తో ప్రకృతికి పెనుముప్పు

Follow Us: Google News Daily Hunt
war
war
FONT SIZE
GET APP

war: ప్రకృతి వైపరీత్యాలు, పెను ఉప్పెనలు, అకాల వర్షాలు ఇవన్నీ ఒకెత్తయితే, మానవ నిర్మిత ‘యుద్ధమంటలు’ నేడు భూగోళాన్ని మరో వినాశనం వైపు నెడుతున్నాయి. అభివృద్ధి ముసుగులోసాగుతున్న అంతులేని ఆయుధ పోరాటం కేవలం దేశాల సరిహద్దులనే కాదు, గాలిని, నీటిని, నింగిని కూడా విషతుల్యం చేస్తోంది. యుద్ధం అనేది కేవ లం రక్తపాతం మాత్రమే కాదు, అది పర్యావరణంపై జరు గుతున్న ఒక అఘాయిత్యం. కార్బన్ ఉద్గారాలను పెంచు తున్న నాలుగో అతిపెద్ద కారకంగా నేడు ‘యుద్ధం’ నిలవ డమే దీనికి నిదర్శనం. గత దశాబ్దకాలంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి ప్రవర్తనలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పెరుగుతున్న ఎండలు కేవలం వాతా వరణ మార్పులే కాదు, మన విధ్వంసక చర్యల ప్రతిధ్వను లు. ఆధునిక యుద్ధాలలో వాడుతున్న క్షిపణులు, బాంబు ల నుంచి వెలువడే అపారమైన ఉష్ణశక్తి నేరుగా వాతావర ణంలో కలిసిపోతోంది.

Read Also : Iran-USA War: హోర్ముజ్ జలసంధిపై ట్రంప్ సంచలన ప్రతిపాదన.. ఓడలపై భారీ సుంకం విధించాలని డిమాండ్!

war
war

war: ద్వంద్వ నీతికి నిదర్శనం

గత 175 ఏళ్ల చరిత్రలో 2024 ఫిబ్రవరి అత్యంత ఉష్ణోగ్రతలున్న నెలగా నమోదవ్వడం మనల్ని హెచ్చరిస్తోంది. ఇది కేవలం ప్రకృతి చక్రం కాదు, మానవ నిర్మిత గన్పౌడర్ పొగ ఫలితం. టీఎన్టీ, ఆర్డీ ఎక్స్ వంటి పేలుడు పదార్థాల్లో ఉండే సీసం, యురేని యం వంటి భార లోహాలు నేలని, నీటిని రాబోయేతరాల వరకు పనికిరాకుండా చేస్తున్నాయి. ఒకవైపు గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడుతూనే, మరోవైపు టన్నుల కొద్దీ మందు గుండును పేల్చడం మానవాళి ద్వంద్వ నీతికి నిదర్శనం. యుద్ధం ఎప్పుడూ రెండు దేశాలమధ్యే ముగిసిపోదు. రష్యా ఉక్రెయిన్, ఇజ్రాయెల్ గాజా, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య చెల రేగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్త ఇంధన, చమురు సంక్షోభాలకు దారితీస్తున్నాయి. యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలు వెదజల్లే కార్బన్ ఉద్గారాలు ఏదేశపు లెక్కల్లో నూ ఉండవు. ఈ -విష రసాయనాలు పర్యావరణ వ్యవస్థ లను గందరగోళానికి గురిచేస్తున్నాయి.

క్లౌడ్ బరస్ట్

భూమిపై తమ ఉనికిని తామే నాశనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఏకైక జీవి మానవుడే. అంతులేని సంపద పోగుచేయాలనే అంధ మైన తపన, ప్రతిదాన్నీ నియంత్రించాలనే అహంకారం భూమి ఉష్ణోగ్రతను పెంచుతున్నాయి. పరస్పర శత్రుత్వా లు పెరిగి యుద్ధాలు సంభవిస్తున్నప్పుడు, ప్రకృతి తన శాంతియుత స్వభావాన్ని కోల్పోయి విలయతాండవం చేస్తుం ది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం సముద్రాలపై స్పష్టం గా కనిపిస్తోంది. సముద్రాలు వేడెక్కడం వల్ల వాతావరణం లో తేమ అసాధారణంగా పెరుగుతోంది. ఈ అదనపు తేమ భవిష్యత్తులో క్లౌడ్ బరస్ట్ రూపంలోనో లేదా అకాల తుపా నుల రూపంలోనో విరుచుకుపడటం ఖాయం. ఒకసారి సముద్రాల సమతుల్యత దెబ్బతింటే, అది మానవాళి ఉనికి నే ప్రశ్నార్థకం చేస్తుంది.

war
war

పర్యా వరణనాశనానికి దారితీస్తోంది

అడవులు తగలబడిపోతున్నాయి, జలవనరులు కలుషితమవుతున్నాయి. యుద్ధ విమానాల నుంచి వెలువడే పొగ పొరలు సూర్యరశ్మిని బంధించి ‘గ్రీన్ హౌస్’ ప్రభావాన్ని మరింత తీవ్రంచేస్తున్నాయి. శాంతిస్థాపన పేరుతో జరుగుతున్న ఈ మారణహోమం, పరోక్షంగా పర్యా వరణనాశనానికి దారితీస్తోంది. యుద్ధాలవల్ల కలిగే పర్యా వరణ నష్టాన్ని పూడ్చడం అసాధ్యం. ఒక్క క్షిపణి దాడి వల్ల విడుదలయ్యే కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి లక్ష లాది చెట్లను నాటాల్సిఉంటుంది. వాతావరణ మార్పుల కు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాల్సిన ఈ కీలక తరుణంలో, ఆయుధాలతో ఒకరినొకరు నాశనం చేసుకోవడం అత్యంత విషాదకరం.


-పసుపులేటి. వెంకటేశ్వరరావు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు