📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Israel Iran War: యుద్ధం ఎఫెక్ట్.. భారీగా తగ్గిన కోడిగుడ్డు ధర

Author Icon By Aanusha
Updated: March 5, 2026 • 10:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Israel Iran War: సాధారణంగా వేసవి కాలంలో కోడిగుడ్ల వినియోగం తగ్గి ధరలు స్వల్పంగా తగ్గుతుంటాయి.. అయితే, ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం పౌల్ట్రీ రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. పశ్చిమాసియాలో ఆరు రోజులుగా కొనసాగుతున్న డ్రోన్లు, క్షిపణి దాడుల కారణంగా మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

Read Also: Iran Israel War: పడిపోయిన బాస్మతి బియ్యం ధరలు

ఎగుమతులు నిలిచిపోవడమే ప్రధాన కారణం

ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య పరస్పర దాడులతో పశ్చిమాసియా రగులుతోంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా కీలకమైన పోర్టులు, ఎయిర్ పోర్టులు మూతపడ్డాయి. దీనివల్ల భారత్ నుంచి జరిగే కోడిగుడ్ల ఎగుమతులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బయటకు వెళ్లాల్సిన స్టాక్ అంతా స్థానిక మార్కెట్లలోనే పేరుకుపోవడంతో ధరలు దారుణంగా పడిపోయాయి.

War effect.. Egg prices have dropped drastically

రూ. 4 మార్క్ కంటే దిగువకు ధరలు

ఎగుమతులు నిలిచిపోవడంతో పౌల్ట్రీ పరిశ్రమకు భారీ మొత్తంలో నష్టం చేకూరుతుంది. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతల కారణంగా పోర్టులు, ఎయిర్ పోర్టులు మూసివేయడం పౌల్ట్రీ పరిశ్రమపై భారీ ప్రభావం పడుతోంది. ప్రస్తుతం నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ(ఎన్ఈసీసీ) ధర రూ.4.20కి పడిపోయింది. ఎగుమతులు నిలిచిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో గుడ్డు ధర రూ.3.30కి కూడా పడిపోయింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Egg prices Israel Iran War Impact NECC Egg Rate Poultry Industry Loss

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.