Telugu News: Vladimir Putin : గాంధీజీ కి నివాళులు  అర్పించిన పుతిన్‌

Read Time:  1 min
Vladimir Putin
Vladimir Putin
FONT SIZE
GET APP

పుతిన్‌కు ఢిల్లీలో ఘన స్వాగతం

భారత్ పర్యటనకు విచ్చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు శుక్రవారం ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. పర్యటనలో భాగంగా ఆయన రాజ్‌ఘాట్‌ను(Rajghat) సందర్శించి జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్శనలో పుతిన్‌తో పాటు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఉన్నారు. అనంతరం పుతిన్ సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు.

 Read Also: India-Russia: పుతిన్ భారత పర్యటనతో ప్రయోజనం ఎంత?

Vladimir Putin
Vladimir Putin pays tribute to Gandhiji

రాష్ట్రపతి భవన్‌లో గౌరవ వందనం

అంతకుముందు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో పుతిన్‌కు సంప్రదాయబద్ధంగా గౌరవ వందనంతో స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన్ను ఆత్మీయంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఇరు దేశాల ఉన్నతాధికారులను పరస్పరం పరిచయం చేసుకున్నారు.

హైదరాబాద్ హౌస్‌లో కీలక చర్చలు

ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, (Prime Minister Modi) అధ్యక్షుడు పుతిన్ హైదరాబాద్ హౌస్‌లో అధికారిక చర్చలు జరపనున్నారు. రక్షణ, ఇంధన రంగాల్లో సహకారం, ప్రాంతీయ భద్రత, దీర్ఘకాలిక ఆర్థిక భాగస్వామ్యం వంటి కీలక అంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ చర్చలు ఇండో–రష్యా సంబంధాలను మరింత బలోపేతం చేయనున్నాయని విశ్లేషకుల అభిప్రాయం.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Sushmitha

రచయిత గురించి

Sushmitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.