📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

Latest news: Viral Video: భోజనం ధర తెచ్చిన తంటా.. రైల్లో సిబ్బంది దాష్టీకం

Author Icon By Saritha
Updated: November 6, 2025 • 3:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చిన్న విషయం చిలికి చిలికి గాలివానగా మారుతుంది. అది ఊహించని పరిణామాలకు దారితీయొచ్చు. చికెన్ కూరలో కారం ఎక్కువైందని భార్యపై కోప్పడ్డ భర్త.. మనస్తాపంతో ఆ నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఇలాంటి వార్తలు నిత్యం మనం చూస్తూనే ఉంటున్నాం. పెళ్లి విందుల్లో ముక్కపడలేదని, గొడవ పడి పెళ్లిళ్లు రద్దయిన సంఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా(Viral Video) రైల్లో భోజనం రేటు ఎందుకు అదనంగా ఉందని అడిగినందుగు ప్రయాణికుడిపై క్యాటరింగ్ సిబ్బంది దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Read also: కాంచీపురం దేవాలయంలో బల్లుల తాపడాలు మార్చిడం పై కలకలం

Viral Video: భోజనం ధర తెచ్చిన తంటా.. రైల్లో సిబ్బంది దాష్టీకం

రూ.20 అదనంగా ఎందుకు ఉందని ప్రశ్నతో వివాదం

ఉత్తరప్రదేశ్లో(UttarPradesh) ఝాన్సీ సమీపంలో అండమాన్ ఎక్స్ ప్రెస్ రైలులో రూ.20 అదనంగా వసూలు చేయడాన్ని ప్రశ్నించినందుకు ఓ ప్రయాణికుడిపై క్యాటరింగ్ సిబ్బంది కర్రలు, బెల్టులతో దాడికి దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. నిహాల్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి కత్రా నుంచి బినాకు అండమాన్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్నారు. ప్రయాణంలో ఆయన రైల్లో వెజ్ మీల్స్ ఆర్డర్ చేశారు. దాని ధర రూ.110 ఉండగా, క్యాటరింగ్ సిబ్బంది ఆయన వద్ద రూ.130 వసూలు చేశారు. దీనిపై నిహాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ధర ఎందుకు ఎక్కువగా తీసుకుంటున్నారని సిబ్బందిని ప్రశ్నించారు. ఈ విషయమై ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన క్యాటరింగ్ సిబ్బంది, నిహాల్ పై దాడికి తెగబడ్డారు. కొందరు కర్రలు, మరికొందరు బెల్టులతో ఆయనను విచక్షణారహితంగా కొట్టారు. తోటి ప్రయాణీకులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా వవారు లెక్కచేయకుండా దాడిని కొనసాగించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

andaman-express catering-staff-assault food-price-dispute Latest News in Telugu passenger-attack Telugu News train-attack uttar-pradesh viral-video

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.