పర్యాటక ప్రాంతాల్లో ఆహార పదార్థాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. సెలవుల సమయంలో, వీకెండ్స్‌లో, పండుగల రోజుల్లో టూరిస్టులు భారీగా తరలివచ్చే ప్రాంతాల్లో చిన్నపాటి ఆహార వ్యాపారాలే మంచి ఆదాయాన్ని తీసుకురాగలవు. అయితే ఈ అవకాశాన్ని ప్రాక్టికల్‌గా నిరూపిస్తూ ఓ కంటెంట్ క్రియేటర్ చేసిన ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media) హాట్ టాపిక్‌గా మారింది. (Viral Video) పర్యాటకులకు మ్యాగీ అమ్ముతూ ఒక్కరోజులో రూ.21 వేలు సంపాదించానని చెప్పిన వీడియో వైరల్‌గా మారింది.
Read Also: India: భారత్-చైనా సంబంధాల్లోనూ కీలకమైన మార్పులు ..ఆందోళనలో అమెరికా
300 నుంచి 350 ప్లేట్లు అమ్మాడు
బాదల్ ఠాకూర్ అనే ఒక కంటెంట్ క్రియేటర్ చేసిన ఒక ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. (Viral Video) పర్వత ప్రాంతాలు చూసేందుకు వచ్చే టూరిస్ట్‌లకు ఒక రోజు మొత్తం మ్యాగీ చేసి అమ్మడం ద్వారా భారీగా ఆదాయం పొందవచ్చని ఆయన ప్రపంచానికి నిరూపించాడు. కష్టపడి కొండ ప్రాంతాలకు వచ్చే టూరిస్ట్‌లకు సరదాగానో లేక ఆకలిగా ఉన్నప్పుడో ఏదో ఒక స్నాక్ అందిస్తే.. దాని వల్ల భారీగా సంపాదించవచ్చని అతడు గ్రహించాడు.
దీంతో అక్కడ మ్యాగీ చేయడం ప్రారంభించాడు.అక్కడికి వచ్చిన పర్యాటకులకు ప్లేట్ రూ.70 చొప్పున, చీజ్ మ్యాగీ రూ.100 చొప్పున అమ్మాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 300 నుంచి 350 ప్లేట్లు అమ్మాడు. దీని ద్వారా రూ.21 వేలు వచ్చాయని బాదల్ తెలిపాడు. చల్లని కొండప్రాంతం కావడంతో వేడివేడి మ్యాగీ కోసం పర్యాటకులు ఎగబడతారని నెటిజన్లు ఈ వీడియోకు కామెంట్లు పెడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: